ఆ పార్టీలో చేరుతున్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీకి ఇక డౌటే..

ఆ పార్టీలో చేరుతున్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీకి ఇక డౌటే..
x
Highlights

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచి ఆరంభించనున్నాడు. ఆదివారం జనతా దళ్ యునైటెడ్...

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని బీహార్ నుంచి ఆరంభించనున్నాడు. ఆదివారం జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నాడు 'బిహార్ నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఉత్తేజభరితంగా ఉంది' అని ట్వీట్ చేశాడు.

ప్రశాంత్ కిశోర్ 2014 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తరువాత బీహార్ లో లాలూ, నితీష్ కూటమికి పనిచేశారు. అయితే ఈ రెండు ఆయనకు సంతృప్తినిచ్చాయి. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ అసీంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీతో కలిసి వ్యూహాలను రచించాడు. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ 350 పైచిలుకు సీట్లలో గెలుపొందింది. రెండు నెలల కిందట వరకు వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేయడం దాదాపు కష్టమేనని భావించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories