బాగా వెన‌క‌బ‌డిపోతున్న ప్ర‌భాస్

బాగా వెన‌క‌బ‌డిపోతున్న ప్ర‌భాస్
x
Highlights

డార్లింగ్ ప్రభాస్.. తొటి స్టార్ హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడి పోయాడు. కనీసం వాళ్లను రీచ్ కూడా కావడం లేదు. అదేంటి ప్రభాస్ బాహుబలితో రికార్డులు...

డార్లింగ్ ప్రభాస్.. తొటి స్టార్ హీరోలతో పోల్చుకుంటే బాగా వెనకబడి పోయాడు. కనీసం వాళ్లను రీచ్ కూడా కావడం లేదు. అదేంటి ప్రభాస్ బాహుబలితో రికార్డులు స్రుష్టిస్తే వెకబడిపోయాడు అంటారేంటి అనుకుంటున్నారా. అవును రికార్డుల విషయం పక్కనపెడితే...సినిమాల విషయంలో మాత్రం ప్రభాస్ బాగా స్లో అయ్యాడు. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ ను తిట్టుకుంటున్నారు.

గతంలో హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు అలవోకగా రిలీజ్ చేసేవారు. కానీ అది రాను రాను ఏడాదికి ఒక్క సినిమానే అనేలా మారిపోయింది. కానీ డార్లింగ్ ప్రభాస్ కు ఇది కూడా మహా గగనంలా మారిపోయింది. కనీసం ఏడాదికి కూడా ఒక సినిమాను రిలీజ్ చేయడం లేదు. భారీ బడ్జెట్ మూవీస్ అంటూ ఏళ్లకు ఏళ్లు వ్రుదా చేస్తున్నాడు.

ప్రభాస్ మిర్చి మూవీ 2013లో రిలీజైంది. ఆ తర్వాత బహుబలి మూవీ రిలీజ్ కు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. బాహుబలి ది బిగినింగ్ 2015 లో వస్తే..బాహుబలి 2కు మరో రెండేళ్లు పట్టింది. బాహుబలి సిరీస్ అంటే సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి సెట్టింగ్స్ ,గ్రాఫిక్స్ కు టైం పట్టింది..అందుకే ఆ సినిమాకే ఐదేళ్లు కేటాయించాడు అనుకుందాం. మరి బాహుబలి తర్వాతనైనా స్పీడ్ పెంచుతాడు అనుంటే ఇప్పుడు కూడా అదే లేట్ స్ట్ర్రాటజీని కంటీన్యూ చేస్తున్నాడు.

బాహుబలి 2సినిమా పోయిన ఏడాది సమ్మర్ లో వచ్చింది. అంటే నెక్ట్స్ సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకున్నా..సాహో మూవీ ఈ ఏడాది రిలీజ్ కావాలి. కానీ ఈసినిమాను కూడా లేట్ చేస్తున్నాడు. సాహో సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. బాహుబలి సినిమాతో తనపై పెరిగినపోయిన అంచనాలను రీచ్ కావాలనే ఉద్దశంలో సినిమాకు మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు. ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా భారీ లెవెల్లో యాక్షన్స్ సీన్స్ కు ప్లాన్ చేస్తూ సినిమాను మరో ఏడాదికి పొడిగించాడు.

సినిమాను కొత్తగా ప్రజెంట్ చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ అదే పనిగా ఒక్కో సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకోవడమే ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది. అందుకే ఫ్యాన్స్ అంతా ప్రభాస్ పై గుర్రుగా ఉన్నారు. ప్రభాస్ ఇకనైనా స్పీడ్ పెంచితే బాగుండని కోరుకుంటున్నారు. తోటి స్టార్ హీరోల్లా కనీసం ఏడాది ఒక సినిమానైనా చేస్తేనే..వాళ్లకు పోటీ ఇవ్వచ్చు. కానీ రేండేళ్లకు ఓసారి మోహాం చూపిస్తే ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే. ప్రస్తుతం సాహో సినిమా చేస్తోన్న ప్రభాస్...హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశాడు. ఈ షెడ్యూల్ ఓ యాన్షన్ సీక్వెల్ తో పాటు ఓసాంగ్ ను చిత్రీకరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories