logo

గోతులకు 3,597 మంది బలి

లక్షలు పోసి కొన్న వాహనాలు ఎన్నో సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అయినా యాక్సిడెంట్ లు జరుగుతాయి. తాగి వాహనాన్ని నడపరు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయరు అయినా ప్రాణాలు పోతున్నాయి. ఎదురుగా వాహనాలు రావు, అదుపు తప్పి ఏ చెట్టునూ ఢీ కొట్టరు అయినా ఆస్పత్రుల పాలవుతారు రహదారులపై పడిన గుంతలు నిండు జీవితాలను బలి తీసుకుంటున్నాయి దేశ వ్యాప్తంగా వేలల్లో ప్రమాదాలకు వందల్లో మరణాలుకు గుంతల రోడ్లు కారణమవుతున్నాయి.

నల్లని రోడ్లుపై నోళ్లు తెరుకున్న గుంతలు ప్రజల ప్రాణాలను మింగేస్తున్నాయి మున్సిపాలిటీలు, రహదారుల అభివృద్ధిశాఖ అధికారుల అసమర్థత, అవినీతితోనే గుంతల్లో మరణాలు చోటుచేసుకుంటున్నాయి రోడ్డు ప్రమాద మరణాలపై రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో ఈ విషయాలు తెలుస్తున్నాయి. దేశంలో ఉగ్రదాడుల్లో కంటే కూడా ఎక్కువమంది గుంతల్లో పడే మృత్యువాత పడినట్లు తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా 2017లో 3,597 మంది రోడ్లపై ఉన్న గుంతల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మృతిచెందారు. మృతుల సంఖ్య 2016తో పోలిస్తే 50 శాతం పెరిగింది. దేశంలో 2017లో ఉగ్రవాదులు, నక్సలైట్లు జరిపిన దాడుల్లో భద్రతాదళాలు, సామాన్యులు తదితరులు కలిపి మొత్తం 803 మంది మృతిచెందారు. అంటే ఉగ్ర మరణాల కంటే కూడా రోడ్లపై గుంతల వల్ల ఎక్కువమంది ప్రాణాలు వదులుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

రోడ్లపై గుంతలు కారణంగా సంభవిస్తున్న మరణాల్లో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 2017లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 987మంది మృతి చెందారు. మహారాష్ట్రాలో అంతక ముందు ఏడాదితో పోలిస్తే 2017లో 726 మందిని గుంతలు పొట్టనపెట్టుకున్నాయి హర్యానాలో గత ఏడాది 522 మంది మృతి చెందారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో గుంతల కారణంగా వేలల్లో ప్రమాదాలు, వందల్లో మరణాలు సంభవించాయి. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నోళ్లు తెరుచుకున్న గుంతలు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఇక నైనా అధికారులు స్పందించి గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమత్తులు చేయాలని కోరుకుంటున్నారు.

లైవ్ టీవి

Share it
Top