ఆంధ్రప్రదేశ్ రైల్వేకు బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రైల్వేకు బడ్జెట్ కేటాయింపులు ఇవే..
x
Highlights

ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప‌రిధిలో విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కి.మీ మేర డబ్లింగ్ కోసం 175 కోట్లు, గుంటూరు – గుంతకల్ మధ్య 443...

ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప‌రిధిలో విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కి.మీ మేర డబ్లింగ్ కోసం 175 కోట్లు, గుంటూరు – గుంతకల్ మధ్య 443 కి.మీ మేర డబ్లింగ్ పనులకు 280 కోట్లు, నడికుడి – శ్రీకాళహస్తి మధ్య 309 కి.మీ కొత్త లైన్ ప్రాజెక్ట్ కోసం 700 కోట్లు, కడప – బెంగుళూరు మధ్య కొత్త లైన్ నిర్మాణానికి 210 కోట్లు, గుంతకల్ – కల్లూరు మధ్య 40.60కిమీ మేర నిర్మిస్తున్న డబుల్ లైన్ కోసం 15 కోట్లు, గుత్తి – ధర్మవరం మధ్య 90 కి. మీ మేర నిర్మిస్తున్న డబ్లింగ్ ప్రాజెక్టు కోసం 126 కోట్లు.

కొత్తపల్లి – నర్సాపూర్ మధ్య 57 కి.మీ మేర నిర్మిస్తున్న కొత్తలైన్ కోసం 200 కోట్లు. కర్నూల్ లో నిర్మిస్తున్న మిడ్ లైఫ్ రిహ్యాబిలిటేష‌న్ ఫ్యాక్ట‌రీ కోసం 80 కోట్లు, తిరుప‌తి రైల్వే స్టేష‌న్ లో రెండో ప్రవేశ మార్గం కోసం 12.45 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేష‌న్ అభివృద్ది కోసం 6కోట్లు కేటాయించింది. విజయవాడ – గుంటూరు మూడోలైన్ నిర్మాణానికి 350 కోట్లు కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories