పేదోడికి వరంగా మారిన బస్తీదవాఖానాలు..

పేదోడికి వరంగా మారిన బస్తీదవాఖానాలు..
x
Highlights

బస్తీవాసుల వైద్యకష్టాలకు చెక్‌పెట్టింది సర్కారు. పేదల ముంగిటికి వైద్యసేవలు తీసుకొచ్చింది. బస్తీల రోగులకు స్పెషలిస్ట్‌ల వైద్యం అందించడంతో పాటు...

బస్తీవాసుల వైద్యకష్టాలకు చెక్‌పెట్టింది సర్కారు. పేదల ముంగిటికి వైద్యసేవలు తీసుకొచ్చింది. బస్తీల రోగులకు స్పెషలిస్ట్‌ల వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులను అందిస్తోంది. డాక్టర్లు ఉంటే మందులుండవ్‌ మందులుంటే డాక్టర్లు ఉండరు. చిన్న రోగానికీ పెద్దాస్పత్రికి వెళ్లాల్సిందే. ఇది ఒక్కప్పటి సమస్య పేదోడి అందని ద్రాక్షగా మారిన వైద్యానికి సర్కారు చెక్‌ పెట్టింది. పేదోడి ముంగిటికే సర్కారు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంది. ప్రయోగత్మకంగా ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలకు మంచి ఆదరణ లభించింది.

జీహెచ్‌ఎంసీ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రారంబించిన బస్తీదవాఖాల్లో కార్పొరేట్‌ స్దాయిలో వైద్యం అందిస్తున్నారు. స్పెషలిస్టులతో కూడిన వైద్యం ప్రజల దగ్గరకే రావడంతో బస్తీరోగులు ఆనంద పడుతున్నారు. ఏ రోగమొచ్చిన ఏ గాంధీకో, ఉస్మానియాకో పరుగులు తీసేవారమని ఇప్పుడు తమ ప్రాంతాలకు వైద్యసేవలు రావడం సంతోషంగా ఉందంటున్నారు.

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేసేందుకు సర్కారు ఏర్పాటు చేసిన ఈ దవాఖానాలో ప్రాధమిక వైద్యంతో పాటు బీపీ, థైరాయిడ్‌ లాంటి శాశ్వత వ్యాధులకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. చిన్నపిల్లలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అన్ని రకాల పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. బస్తీలలో ఏర్పాటు చేసిన ఆసుపత్రులలో ఒక డాక్టర్, నర్సు, ఒక కంపౌండర్ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల దాకా అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కూలీనాలీ చేసుకునే పేదోడి ఇంటి ముంగిటికే వైద్య సేవలు అందుబాటులోకి రావటం పట్ల బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories