ఎకరానికి 4 వేల పంట పెట్టుబడి చెక్కుల పంపిణీ వాయిదా

Submitted by arun on Mon, 04/16/2018 - 11:23
farmer

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంటపెట్టుబడి చెక్కుల పంపిణీ వాయిదా పడింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ తర్వాతే రైతులకు చెక్కులు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాతే పెట్టుడి సాయం చెక్కుల పంపిణీపై క్లారిటీ రానుంది.

రైతు బంధు పథకం కింద ఎకరానికి 4 వేల పంట పెట్టుబడి సాయానికి ఇచ్చే చెక్కుల పంపిణీకి మరికొంత సమయం పట్టే చాన్స్ ఉంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణి తర్వాతే చెక్కులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో మే నెల రెండో వారం తర్వాతే చెక్కుల పంపిణీ చేపట్టాలని సర్కార్ భావిస్తోంది.

ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల 19 నుంచే ప్రారంభించాలనుకున్నారు. ఇందుకోసం పంపిణీ చేయాల్సిన 55 లక్షల చెక్కుల్లో 30 లక్షల చెక్కుల ముద్రణ కూడా పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇక కొత్త పాసు పుస్తకాల పంపిణీ మార్చి 11నే ప్రారంభించాలనుకున్నారు. కానీ ముద్రణలో ఆలస్యమవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెలాఖరు కల్లా పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయనున్నారు అధికారులు. నెలాఖరున టీఆర్ఎస్ ప్లీనరీ ముగిసిన తర్వాత పంట పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు.

English Title
post delivery checks rythu bandhu subsidy scheme

MORE FROM AUTHOR

RELATED ARTICLES