అమ్మాయిల న‌డుముని కొల‌వ‌డంలో లోకేష్ దిట్ట‌

Submitted by lakshman on Thu, 03/22/2018 - 11:29
posani krishna murali sensational comments on nara lokesh

ఏపీ అధికార పక్షం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హోదా కోసం పోరాడుతున్నామన్న విశ్వాసం కలిగించలేక.. ప్రత్యర్థుల ఆరోపణలను తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా మొదటికే మోసం తెచ్చేలా మారాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. దీంతో చలన చిత్ర ప్రముఖులు సైతం టీడీపీని గట్టిగానే పారేస్తున్నారు.
అప్పుడు లాఠీలతో కొట్టించి..:
 నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు ఎలా పుట్టుకొస్తాయని ప్రశ్నిస్తున్నారు. హోదా కోసం గతంలో ఉద్యమిస్తే.. లాఠీలతో కొట్టించి, అరెస్టులు చేయించి.. మళ్లీ ఇప్పుడు మాట మార్చడానికి సిగ్గు లేదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
చేవ చచ్చిందా అంటే.. అర్థాలు మారుతాయి: 
సినీ పరిశ్రమపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలకు కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు పోసాని. 'మీరు లేచినప్పుడే మేమూ లేవాలా?.. మీకంటే ముందు మేము లేచినప్పుడేమో లాఠీలతో కొట్టిస్తారా?..' అని ప్రశ్నించారు. చేవ చచ్చిపోయిందా? అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నిస్తున్నారని.. దానికి అనేక రకాల అర్థాలున్నాయని పేర్కొన్నారు. ఇక టీడీపీ, లోకేష్ అవినీతి ఆరోపణలపై నిజనిజాలేంటో తనకు తెలియదని కాబట్టి వాటిపై మాత్రం స్పందించనని అన్నారు పోసాని.
 అమ్మాయిల నడుములు కొలుస్తున్నాడు..: 
ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సంపాదిస్తున్న వందల కోట్ల మత్తులో జోగుతున్నారా? అన్న ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు మరో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు పోసాని. మత్తులో జోగుతున్నది సినిమావాళ్లు కాదని, అసలు మత్తులో జోగుతోంది ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అని అన్నారు. గతంలో లీకైన లోకేష్ విదేశీ ఫోటోలను చూపుతూ.. 'ఆయన కేవలం అమ్మాయిలతోనే మందు తాగుతారు, విదేశాల్లో టేపుతో అమ్మాయిల నడుమును కొలుస్తారు' అని పోసాని ఎద్దేవా చేశారు.
ముందు అది తెలుసుకో: 
స్విమ్మింగ్‌ పూల్‌లో మందు తాగుతూ.. అమ్మాయిలతో గడుపుతూ.. సినిమా వాళ్ల కన్నా నీచంగా ప్రవర్తించింది మీ నాయకుడే అన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ గుర్తెరగాలని పోసాని మండిపడ్డారు. ఎదుటివారిపై విమర్శలు చేసే ముందు కాస్త తెలివితో మాట్లాడాలని హితవు పలికారు. 

English Title
posani krishna murali sensational comments on nara lokesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES