పవన్ కు పూనం కౌర్ విజ్ఞప్తి

పవన్ కు పూనం కౌర్ విజ్ఞప్తి
x
Highlights

కొందరి రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని నటి పూనం కౌర్ వాపోతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కల్పించుకుని తన గౌరవాన్ని కాపాడాలని...

కొందరి రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని నటి పూనం కౌర్ వాపోతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కల్పించుకుని తన గౌరవాన్ని కాపాడాలని వేడుకుంటూ వరుస ట్వీట్లు పెట్టింది. 'గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారు.. ఇది నా కెరీర్, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు సహాయం చేయండి' అని పూనమ్ మరో ట్వీట్ చేశారు. ఆపై "రహస్య అజెండాలతో వస్తున్న వారికి లక్ష్యంగా నేను మారాలని అనుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి ఈ విషయంలో మాట్లాడుతాను" అని పవన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది. దీంతో పూనంకు మద్దతుగా పవన్ అభిమానుల నుంచి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కొద్దిసేపటి తరువాత పూనం సదరు ట్వీట్లను డిలీట్ చేసింది. అప్పటికే స్క్రీన్ షాట్స్ గా మారిన ఈ ట్వీట్స్ ఇప్పుడు ఇమేజ్ రూపంలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరూ చూడవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories