అమెరికా సెక్స్ రాకెట్: పూనమ్ షాకింగ్ కామెంట్స్

Submitted by arun on Thu, 06/28/2018 - 16:36
Poonam Kaur

కాస్టింగ్ కౌచ్ గురించి మరిచిపోకముందే అమెరికాలో చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది. 

ఈ విషయంపై ప్రముఖులు ఒక్కొక్కరుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై స్పందించింది. అసలు కిషన్, చంద్రలు భార్యభర్తలే కాదని చెప్పింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పందించిన పూనమ్.. 'అమెరికాలో ఓ ఈవెంట్ కోసం వెళ్లగా.. నేను హోటల్ లో ఒంటరిగా ఉన్న సమయంలో కిషన్ కు చెందిన ఓ వ్యక్తి నా దగ్గరకి వచ్చాడు. నాకు తెలుగు అర్ధం కాదనుకొని ఎక్కువ మాట్లాడాడు. ఆ సమయంలో అతడి చెంప పగలగొట్టాను. డబ్బు ఎర చూపించడం, భయపెట్టడం వంటివి చేసి అమెరికాలో లొంగదీసుకుంటారు' అంటూ చెప్పుకొచ్చింది.

English Title
poonam kaour on america sex racket

MORE FROM AUTHOR

RELATED ARTICLES