నిడదవోలు జనసేన పరేషాన్

నిడదవోలు జనసేన పరేషాన్
x
Highlights

మొన్నటి వరకూ అక్కడ ఇద్దరే ఇద్దరు పోటీదార్లు. వారిద్దరిలో ఎవరినో ఒకర్నీ జనం ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరో పార్టీ ఎంట్రీ అయ్యింది. ఆ పార్టీ నుంచి...

మొన్నటి వరకూ అక్కడ ఇద్దరే ఇద్దరు పోటీదార్లు. వారిద్దరిలో ఎవరినో ఒకర్నీ జనం ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరో పార్టీ ఎంట్రీ అయ్యింది. ఆ పార్టీ నుంచి వారిద్దరికీ గట్టి పోటీ ఎదురవుతోంది. సామాజిక సమీకరణాలు కూడా ఫలితాన్ని ఊగిసలాడేలా చేస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు షివరింగ్‌ మొదలైతే, ప్రతిపక్ష అభ్యర్థికీ వణుకుపుడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది ఎలక్షన్ రిజల్ట్.

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం మొత్తం ఓటర్లలో, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ. ఆ తరువాతి స్థానంలో ఎస్సీ, బిసి, ఇతర సామాజిక వర్గాల ఓట్లు ఉంటాయి. ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్దుల్లో ఒక్క టీడీపీ అభ్యర్ది శేషారావు తప్ప మిగతా ఇద్దరూ వైసీపీ, జనసేన అభ‌్యర్దులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఈసారి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరి ఖాతాలోకి ఎన్ని వెళ్తాయనేదానిపైనే అభ్యర్దుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.

నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 3వేల 84మంది. 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 87.13శాతం. ఓటు హక్కు వినియోగించున్న పురుషులు 85,707 మంది. మహిళలు 91,240. అత్యధికంగా ఓటు వేసిన మహిళలు ఎవరికి హారతి పట్టారన్నది అంతుబట్టడం లేదు.

అంతేకాదు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతాయో ఆ పార్టీ ఆధిక్యం కనబర్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నిడదవోలు నియోజకవర్గం ఏర్పడిన తరువాత టీడీపీ తప్ప మరో పార్టీ ఇక్కడ గెలవలేదు. మరి ఈసారి ఆ పరిస్థితి మారుతుందా లేదా అనేది నిడదవోలు నియోజవర్గం ఫలితాలపై మరింత ఆశక్తిని రేెకెత్తిస్తున్నాయి.

సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇప్పటికే రెండుసార్లు నిడదవోలు నియోజకవర్గంలో విజయం సాధించారు. తిరిగి 2019 ఎన్నికల్లో నెగ్గితే, ఈసారి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టిస్తారు. ఇదే టార్గెట్‌గా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది శేషారావు ప్రచారం నిర్వహించారు. రెండుసార్లు గెలిచిన అనుభవం పోల్ మేనేజ్‌మెంట్ చేయగలిగిన నేర్పు, ఈసారి కూడా కలిసి వస్తుందనే దీమాతో ఉన్నారు శేషారావు. అంతేకాదు తాను స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తినని, మిగతా ఇద్దరు ప్రధాన పార్టీ అభ్యర్దులు నాన్ లోకల్ కాబట్టి, ఈ సెంటిమెంట్ తనకు వర్కవుట్ అవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన శేషారావుకు, ఈసారి కాపు ఓటు బ్యాంక్ ఎంత వరకూ కలిసి వస్తుందనేదే, ఆయన గెలుపును శాసించబోతోంది.

నిడదవోలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జి.శ్రీనివాసనాయుడు పోటీలో ఉన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జి.ఎస్.రావు తనయుడైన శ్రీనివాసనాయుడు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. నిడదవోలుకు చెందిన వ్యక్తి కానప్పటికీ రెండేళ్లుగా నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు పార్టీలో యాక్టీవ్‌గా కొనసాగుతూ, నిడదవోలులో ఓటర్లకు దగ్గరవుతూ వచ్చారు. రెండు దఫాలు ఎమ్మెల్యేగా నెగ్గినా నిడదవోలులో ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో శేషారావు విఫలమయ్యారని, ఇసుక మాఫియా వంటి అవినీతి పనుల్లో టీడీపీ ఎమ్మెల్యే ప్రజాధనం దోచుకున్నారని, ఇవే తనకు కలిసొచ్చే అంశాలని నమ్మకంగా ఉన్నారు శ్రీనివాస నాయుడు. ఈ ఎన్నికల్లో నిడదవోలు ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని, తన గెలుపు ఖాయమనే దీమాతో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది జి .శ్రీనివాసనాయుడు.

నిడదవోలు జనసేన అభ్యర్దినిగా అతికాల రమ్మశ్రీ తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. జనసేన ఆశయాలకు ప్రభావితం అవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఎమ్మెల్యే అభ్యర్దిగా రంగంలోకి దిగిన రమ్యశ్రీ, వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా జనం భావించారు. అంతేకాదు కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో, అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా అభ్యర్ది కావడం రమ్యశ్రీకి కలిసివచ్చే అంశం. అయితే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ, ఇన్ని సానుకూలాంశాలు ఓట్లుగా మారాయా అన్నదే రమ్యశ్రీని వెంటాడుతోంది. అయితే పవన్‌పై అభిమానం, మహిళల ఆదరణే తనను గెలిపిస్తాయన్న దీమాలో ఉన్నారు రమ్యశ్రీ. ఇలా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంపై ఎవరి అంచనాలు వారివే. గెలుపు లెక్కల్లో ఎవరి విశ్వాసం వారిదే.


Show Full Article
Print Article
Next Story
More Stories