ఉప ఎన్నికల లక్ష్యం ఇదేనట..!

Submitted by lakshman on Thu, 03/15/2018 - 08:13
harish rao

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం.. ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంతలోనే.. రాష్ట్రంలో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన గొడవతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని సభ రద్దు చేసేసింది. ఇప్పుడు ఇంకో రెండు సీట్లు ఖాళీ అవుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.

దీంతో.. అనుకున్న ప్రకారం నాలుగు సీట్లు ఖాళీ అయితే.. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మిగిలే ఉంది కాబట్టి.. త్వరలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు సీట్లకూ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు.. అసెంబ్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా.. ఈ దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నాటి వరకూ ఆగడం కంటే.. ఇప్పుడే ప్రజల్లో తమకున్న పట్టును నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అందుకే.. పట్టుబట్టి మరీ.. నలుగురు సభ్యులను సభ నుంచి అనర్హత వేటు వేసే ప్రక్రియను కూడా ముందుకు తెచ్చారన్న వాదనను.. ప్రతిపక్షాలు ఆఫ్ ద రికార్డ్ గా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. తెలంగాణలో సాధారణ ఎన్నికలకు ముందు.. ఇది ప్రీ ఫైనల్స్ గానే భావించాల్సి ఉంటుంది. ఏ పార్టీకి ఎడ్జ్ వస్తే.. ఆ పార్టీ.. సాధారణ ఎన్నికల్లో ధైర్యంగా అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుంది.
 

English Title
By-polls likely for Nalgonda, Alampur seats: Harish

MORE FROM AUTHOR

RELATED ARTICLES