పెళ్లి పీటలెక్కనున్న ఎంపీగా ఎన్నికైన నటి

పెళ్లి పీటలెక్కనున్న ఎంపీగా ఎన్నికైన నటి
x
Highlights

ఈ అందాల నటి పేరు నుస్రత్ జహాన్… బెంగాలీ సినిమా నటి. ఖోకా 420,ఖిలాడీ వంటి హిట్ సినిమా ల్లో నటించింది. మిస్ కోల్ కతా గా ఎంపికైన ఈ భామ మొన్నటి...

ఈ అందాల నటి పేరు నుస్రత్ జహాన్… బెంగాలీ సినిమా నటి. ఖోకా 420,ఖిలాడీ వంటి హిట్ సినిమా ల్లో నటించింది. మిస్ కోల్ కతా గా ఎంపికైన ఈ భామ మొన్నటి ఎన్నికల్లో తృణమూల్ పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ లోని బషిర్హాట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోకసభకు ఎన్నికైంది. కాగా సుస్రత్ జహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. గ్లామర్ తారగా పేరొందిన ఆమె తన ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తుంటారు. ఆమెకు సోషల్ మీడియా లో ఫాలోయింగ్ చాల ఎక్కువ.

'ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆదరించారు .. ఇందుకు అందరికీ ధన్యవాదాలు. నేను స్వతహాగా ముస్లింను. అయినా అన్నివర్గాలవారూ ఓటు వేశారు. రాజకీయాల్లో నాకు మమతా బెనర్జీ యే స్ఫూర్తి అంటున్నారు. నా తొలి ఓటును 18వ ఏట దీదీకే వేశాను అని చెబుతున్నారు. తాను కోల్‌కతాకు చెందిన బిజినెస్ మ్యాన్ నిఖిల్‌జైన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు మీడియాకు వివరించారు. పెళ్లి ఎప్పుడు చేసుకునేదీ త్వరలోనే తెలియ చేస్తానని ఆమె తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories