సత్యనిష్ఠ సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు

సత్యనిష్ఠ సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్ :  ఏపీ సీఎం  వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు
x
Highlights

రంజాన్ పండగ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు...

రంజాన్ పండగ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం 'రంజాన్' . నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ శుభాభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories