పోలింగ్ ఏజెంట్ల నియామకంపై అభ్యర్ధుల దృష్టి...కీలక పాత్ర పోషించే ఏజెంట్లకు పార్టీలు గాలం

Submitted by santosh on Wed, 12/05/2018 - 17:45
pts

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక అభ్యర్ధుల దృష్టి పోలింగ్ ఏజెంట్ల వైపు మళ్లింది. ప్రత్యర్ధి పార్టీలు నియమించే వారిని సమర్ధవంతంగా ఎదుర్కొనే నమ్మకస్తుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ఏజెంట్లకు రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నారు. పోలింగ్ కు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులంతా పోలింగ్ ఏజెంట్లపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యఅనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. పోలింగ్ బూత్ లో ఓటర్లు ఓటు వేసే సమయంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును పరిశీలించేంది పోలింగ్ ఏజేంట్లే కావడంతో అభ్యర్ధులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అత్యంత నమ్మకస్తులనే ఏజెంట్లుగా నియమించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 

 ప్రత్యర్ధులు పోలింగ్ ను తమకు అనుగుణంగా మార్చుకోకుండా అన్ని పార్టీలు పోలింగ్ కేంద్రాల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మరో వైపు ఏజెంట్లుగా ఎవరు ఉండబోతున్నారో ఆరా తీసి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అవసరమైతే ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి ఏజెంట్ గా నియమించుకునేందుకు అభ్యర్ధులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల అవసరాన్ని ఆసరగా తీసుకున్న ఆయా పార్టీల కార్యకర్తలు ఏజెంట్లుగా కొనసాగేందుకు పోటీ పడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దన్న దోరణితో వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల వ్యవస్థ ఎంతో మందికి తెలియనప్పటికీ తెరవెనుక వీరి పాత్ర కీలకంగా ఉంటుందనేది ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. 

English Title
political parties searching for election agents

MORE FROM AUTHOR

RELATED ARTICLES