సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న గుంటూరు చోరీ కేసు...కోడలు శివపార్వతి చుట్టూ తిరుగుతున్న విచారణ

Submitted by arun on Fri, 06/15/2018 - 15:51

సంచలనం సృష్టించిన గుంటూరు చోరీ ఘటన.. కీలక మలుపు తిరిగింది. తెలిసిన వారే ఈ చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా కుటుంబ సభ్యుల సహకారంతోనే దుండగులు దోచుకున్నారని.. తేల్చారు. దొంగతనంలో పాలు పంచుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం తెలుసుకున్నారు. ముఖ్యంగా కోడలు.. శివపార్వతిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. 

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సంచలనం సృష్టించిన చోరీ కేసును.. పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పట్టపగలే కోటికి పైగా నగదుతో ఉడాయించిన దుండగులను.. గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం 11 గంటల 30 నిముషాల సమయంలో.. మేకా వేమారెడ్డి ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి.. అడ్రస్ అడుతుతూ.. ఇంట్లోని వారిపై దాడి చేశారు. బీరువాలో ఉన్న కోటికి పైగా నగదుతో పాటు.. 20 సవర్ల బంగారాన్ని అపహరించుకుపోయారు. రాజధానితో పాటు.. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఘటన జరగడంతో.. పోలీసులు ఘటనను ప్రెస్టీజెస్‌గా తీసుకున్నారు. ఇటు తమకున్న పొలాన్ని అమ్మడంతో వచ్చిన రెండున్నర కోట్లకు పైగా సొమ్మును రెండు బ్యాగుల్లో అమర్చామని.. అందులో ఒక బ్యాగును దొంగలు ఎత్తుకుపోయారని.. కోటికి పైగా నగదు దొంగలించారని.. బాధితులు పోలీసులకు తెలిపారు. 

English Title
Police Solves Penumaka Robbery Case

MORE FROM AUTHOR

RELATED ARTICLES