ఈవెంట్‌ యాంకర్లతో అర్ధరాత్రి అసభ్య నృత్యాలు!

Submitted by arun on Thu, 07/19/2018 - 11:46

విజయవాడ లో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. భవానీపురంలోని ఆలీవ్‌ ట్రీ హోటల్ పై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అసభ్య నృత్యాలు చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. అక్కడ ఐదుగురు మహిళలు, 50 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడు ప్రైవేటు యాంకర్లను తీసుకొచ్చి ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన యువతులు హైదరాబాద్, విజయవాడ, భీమవరం ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడిని, మరో ఐదుగురు యాంకర్లను పోలీసులు తప్పించినట్టు తెలుస్తోంది. 

English Title
Police Raids on Olive Tree Hotel Vijayawada

MORE FROM AUTHOR

RELATED ARTICLES