వైసీపీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

Submitted by arun on Wed, 03/07/2018 - 13:40
 YSR Congress

నెల్లూరు జిల్లాలో బెట్టింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విచారణకు హాజరుకావాలంటూ నిన్న పోలీసులు నోటీసులిచ్చారు. ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బెట్టింగ్‌ వ్యవహారంతో బుకీలు, పంటర్లను కలవర పెడుతోంది.

బెట్టింగ్ వ్యవహారంలో ఇప్పటికే జిల్లా పోలీసులు 260 మందిని విచారించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నెల్లూరు కార్పొరేషన్ ఫ్లోర్‌ లీడర్ రూప్‌కుమార్, టీడీజీ మాజీ కార్పొరేటర్ చంద్రలు ఉన్నారు. ఆరు నెలల తర్వాత మళ్లీ బెట్టింగ్‌ వ్యవహారం తెరపైకి రావడంతో జిల్లా అంతటా ఇదే చర్చ జరుగుతోంది. 
 

English Title
Police Notices to YSR Congress MLA

MORE FROM AUTHOR

RELATED ARTICLES