ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి

Submitted by arun on Wed, 08/01/2018 - 12:05
police constable

ఓ కానిస్టేబుల్‌ తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగించాడంటూ గొల్లపాలెం పోలీసు స్టేషన్‌ ఎదుట ఒక యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. బాధితురాలు, నిందితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు రామచంద్రాపురం మండలం, శలపాకకు చెందిన వాకపల్లి నాగబాబు ఇండియన్‌ టిబెట్‌ బోర్డర్‌ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా హర్యానాలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పోలినాటి సంధ్యతో అతినికి ప్రేమ ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సంధ్య కాకినాడలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చదువుతోంది.  జూలై 23న సంధ్యతో కలిసి నాగబాబు బైక్‌పై వెళుతున్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికీ గాయాలయ్యాయి. అప్పుడు వారి ప్రేమ గురించి తెలుసుకున్న సంధ్య తల్లిదండ్రులు నాగబాబు తల్లిదండ్రులతో వారి పెళ్ళి చెయ్యాలని ప్రస్తావించారు. ఆసుపత్రి నుంచి వచ్చాక ఆలోచిద్దాం అని వారు మాట దాటవేశారు. దీంతో సంధ్య అమ్మానాన్నలు జూలై 29న కాకినాడ వెళ్లి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.

తనమీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారనే కోపంతో నాగబాబు అదే గ్రామానికి చెందిన దడాల పద్మశ్రీ అనే మరో యువతిని తుని చర్చిలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య తన బంధువులతో వచ్చి గొల్లపాలెం పొలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీసులు నాగబాబును స్టేషన్‌కు రప్పించారు. తాను ముందు నుంచీ దడాల పద్మశ్రీనే ప్రేమిస్తున్నానని, జూలై 14న తమ ఇద్దరికీ వివాహమైందంటూ అబద్ధం చెప్పాడు. సంధ్య ఆరోపించినట్టు తమ వివాహం జూలై 29న జరగలేదని బుకాయించాడు. అందుకు సంబంధించిన పోటోలు కూడా చూపించి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. అతని స్నేహితుల ఫోన్ నంబర్లు తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. బాధితురాలు జూలై 29న ఎస్పీకి ఫిర్యాదు చేశాక, అదే రోజు రాత్రి నిందితుడు దడాల పద్మశ్రీని వివాహం చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు. ఆ సమయానికి అతడికి అంత తీవ్రమైన గాయాలు లేవు. నిందితుడు నాగబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
 

English Title
police constable fake love

MORE FROM AUTHOR

RELATED ARTICLES