కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
x
Highlights

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు. దీపావళిని పురస్కరంచుకుని మోడీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు....

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు. దీపావళిని పురస్కరంచుకుని మోడీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన మోడీ కొద్దిసేపు అక్కడి భక్తులతో ముచ్చటించారు. కేదార్ నాథ్ ఆలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మోడీ తిలకించారు. అలాగే కేదార్‌పురి పునర్నిర్మాణ పనులను సీమీక్షించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ కేదార్‌నాథ్‌ను సందర్శించడం ఇది మూడవ సారి. కేదార్ నాథ్ ఆలయ సందర్శన తర్వాత మోడీ పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో కలసి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. అయితే మోడీ పంజాబ్‌లో ఏ ప్రాంతానికి వెళ్తార సమాచారం అధికార వర్గాలు చెప్పలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోడీ ప్రతి ఏడాది దీపావళిని సైనికుల మధ్యే జరుపుకుంటున్నారు. 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో జవాన్లతో జరుపుకున్నారు. 2015లో 1965పాటి ఇండో-పాక్‌ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్‌ బోర్డర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోగా గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ మోడీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories