ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి..: మోదీ

Submitted by arun on Wed, 02/07/2018 - 13:15
PM Modi

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ... కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు లేచి చప్పట్లు కొట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అందరి ముందు అవమానించారని మోదీ అన్నారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్యలాంటివాళ్లను అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దని మోదీ విమర్శించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ దుయ్యబట్టారు. తమిళనాడు, పంజాబ్, కేరళలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తాము తెచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం హాస్యాస్పదమని మోదీ హేళన చేశారు. అసలు 12వ శతాబ్దంలోనే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా కన్నడ గురువు బసవేశ్వరుడి గురించీ ప్రస్తావించారు. అప్పుడున్న బిజ్జల సామ్రాజ్యంలోనే మహిళలను కోర్టు రూముల్లోకి అనుమతించేవారని మోదీ చెప్పారు.

English Title
pm modi talks about ntr in parliament

MORE FROM AUTHOR

RELATED ARTICLES