పాక్ ఓటమికి సానియా కారణం ఎలా అవుతుంది .. సానియా మిర్జాకి అండగా నిలిచిన క్రీడాలోకం ..

పాక్ ఓటమికి సానియా కారణం ఎలా అవుతుంది .. సానియా మిర్జాకి అండగా నిలిచిన క్రీడాలోకం ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా నాలుగు రోజుల కింద మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ లో పాక్ జట్టు ఘోరంగా ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే .. ...

ప్రపంచ కప్ లో భాగంగా నాలుగు రోజుల కింద మాంచెస్టర్ వేదికగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ లో పాక్ జట్టు ఘోరంగా ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే .. పాక్ ఓటమిలో కీలక ఆటగాడైన షోయబ్ మాలిక్ ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు ..దీనితో మాలిక్ ఓటమికి ఆయన భార్య సానియా మీర్జా కారణమని సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు . సానియా మిర్జా మ్యాచ్‌ కు ముందురోజు తన భర్తను బయటకు తీసుకెళ్లి, జంక్‌ ఫుడ్ తినిపించిందని, అందువల్లే మాలిక్ డక్కౌట్ అయ్యాడని వేలాది కామెంట్లు వస్తుండటంతో, ఇండియన్ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఆమెకు అండగా నిలిచారు.

మ్యాచ్ ముందురోజు డిన్నర్ చేయడం వల్లే మాలిక్ విఫలమయ్యాడనడం సరికాదని, ఓ భర్తగా భార్యను బయటికి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ చాలా పెద్ద గేమని, షోయబ్ మాలిక్ విఫలమవ్వడానికి సానియా మీర్జాను బాధ్యురాలిని చేయడం సరికాదని, వేరేవారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడ వద్దని భారత ఫుట్ బాల్ స్టార్ బైచూంగ్ భూటియా అన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories