సీసీ కెమెరాను తొలగిస్తూ.. మరో కెమెరాకు చిక్కాడు

సీసీ కెమెరాను తొలగిస్తూ.. మరో కెమెరాకు చిక్కాడు
x
Highlights

మా బస్తీలో సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు ఆగిపోతాయి అంటూ పోలీసులు ఎన్నోసార్లు చెప్పారు. అయితే తమ బస్తీలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ ఆటోల టైర్లు, సీట్లు...

మా బస్తీలో సిసి కెమెరాలు ఉంటే దొంగతనాలు ఆగిపోతాయి అంటూ పోలీసులు ఎన్నోసార్లు చెప్పారు. అయితే తమ బస్తీలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ ఆటోల టైర్లు, సీట్లు మాయం అవుతూనే ఉన్నాయంటూ తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ఆటోడ్రైవర్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించాడు. అయితే కెమెరాలైతే తొలగించిండు కానీ పక్కనే ఉన్న మరో కెమెరాను తోలగించడం మాత్రం మారిచిపోయాడు దీంతో ఆటో డ్రైవర్ చేసిన తతాంగం మొత్తం మరో సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న శాంతినాయక్‌ (30)అనే యువకుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా తన ఆటోను నందగిరిహిల్స్‌ సమీంలోని ఖాళీ స్థలంలో పార్క్‌ చేస్తుంటాడు. చుట్టు సీసీ కెమెరాలు ఉండడంతో ఎలాంటి దొంగతనాలే జరుగవని అనుకునేవారు. గత నెల రోజులుగా తన ఆటో టైర్లు, సీట్లు మాయం కావడంతో కోపానిలోనై రెండురోజుల క్రితం సీసీ కెమెరాను తీసేశాడు. గమనించిన పోలీసులు మరో సీసీ కెమెరాలో ఫుటేజీని పరిశీలించి నిందితుడు శాంతినాయక్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. తన ఆటోలో సామాన్లు పోతున్నాయని, కోపంతో కెమెరాను తీసేశానని శాంతినాయక్‌ చెప్పారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ ఇలా సీసీ కెమెరాను తీసేస్తే ఎలా అంటూ పోలీసులు నిందితుడిని మందలించి పంపేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories