డియర్ ఫ్యాన్స్... ఓపికగా ఉండండి: అల్లు అర్జున్

Submitted by arun on Fri, 07/27/2018 - 13:02
Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' చిత్రం విడుదలైన రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు ఆయన తర్వాతి సినిమా మొదలు కాలేదు. అసలు ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో కూడా బన్నీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. దీంతో బన్నీ కంటే ఎక్కువ టెన్షన్ ఆయన అభిమానుల్లో మొదలైంది. దీంతో వారిని టెన్షన్ ఫ్రీ చేసి కూల్ చేసే ప్రయత్నం చేశాడు ఈ హీరో. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు.

"మై డియర్ ఫ్యాన్స్... మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండమని కోరుతున్నాను. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంత సమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పేందుకు మరింత సమయం తీసుకోనున్నాడని అర్థమవుతోంది.

English Title
Pls Be a Lil Patient -Allu Arjun

MORE FROM AUTHOR

RELATED ARTICLES