నిజామాబాద్ మీదుగా కాచిగూడ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

Submitted by arun on Fri, 06/15/2018 - 17:11
Piyush Goyal

తెలంగాణలో రూ.258 కోట్ల ఖర్చుతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారు. 45 వేల కోట్లతో రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులను పియూష్‌ గోయల్‌ ప్రారంభించారు. కరీంనగర్‌ వరకు పొడిగించిన కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజర్ రైలును వారు జెండా ఊపి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో నాల్గవ పాదచారుల వంతెన నిర్మాణానికి పియూష్‌ గోయల్ శంకుస్థాపన చేశారు. అన్ని రైల్వే స్టేషన్లు, పరిపాలన భవనాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను ప్రారంభించారు. రాష్ట్రంలోని 20 గ్రామీణ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన వై-ఫై సదుపాయాన్ని గోయల్ జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, కేంద్ర మాజీ మంత్రి-సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత, మేయర్ రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
 

English Title
piyush goyal flagged off karimnagar kachiguda passenger train

MORE FROM AUTHOR

RELATED ARTICLES