హైకోర్టును ఆశ్రయించిన సింధుశర్మ

హైకోర్టును ఆశ్రయించిన సింధుశర్మ
x
Highlights

హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ నూతి రామ్మోహన్‌ కోడలు సింధు శర్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పెద్ద కూతురిని అప్పగించాలని హెబియస్‌ కార్పస్‌ రిట్‌...

హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ నూతి రామ్మోహన్‌ కోడలు సింధు శర్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పెద్ద కూతురిని అప్పగించాలని హెబియస్‌ కార్పస్‌ రిట్‌ వేశారు. కూతురిని అప్పగించే విషయంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింధు శర్మ, వశిష్ట, పెద్ద కూతురు రిషితను కోర్టులో హాజరుపరచాలని డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్ట్‌. భర్త, అత్తా మామల నుంచి తన పిల్లలను పొందేందుకు సింధుశర్మ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెకు చిన్న కుమార్తెను అప్పగించారు. మూడున్నరేళ్ల పెద్ద కుమార్తెను కూడా అప్పగించే వరకూ తన పోరాటం ఆగదంటూ చెప్పిన సింధుశర్మ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories