'బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది. పంది కడుపున మనిషి జన్మించాడు' అసలు విషయం ఏంటంటే..

Submitted by nanireddy on Sun, 07/29/2018 - 08:53
pig baby photos goes viral

'బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది. పంది కడుపున మనిషి జన్మించాడు' అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అది నిజమైనదా లేదా నకిలీదా అన్న చర్చ మొదలైంది. నిజానికి ఇది నకిలీ వార్తే.. పంది కడుపున మనిషి శిశువు జన్మించినట్లు అది కూడా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలోనే ఈ సంఘటన జరిగిందని సోషల్ మీడియాలో షేర్‌ అవుతోంది. కొన్ని ఫొటోలు పోస్టుకు జత చేసి నెటిజన్లు షేర్‌ చేసుకుంటున్నారు. అయితే, అవన్నీ తప్పుడు కథనాలుగా తేలింది. ఇటలీకి చెందిన ఆర్టిస్ట్‌ లైరా పంది రూపంలో ఉన్న మానవ శిశువును తయారు చేశారు. అనంతరం నెట్లో షేర్ చేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇవి వైరల్ గా మారాయి. వీటిని కొందరు ఆకతాయిలు ఇలా వాట్సాపుల్లో షేర్ చేస్తూ.. ఆటపట్టిస్తున్నారు.

English Title
pig baby photos goes viral

MORE FROM AUTHOR

RELATED ARTICLES