మళ్ళీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

మళ్ళీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు
x
Highlights

పెట్రోల్‌, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులకు ఏమి చెయ్యాలో అర్ధం కాక వాహనాలు బయటికి తీయకూండా బస్సుల్లో , ఆటోల్లో వెళుతున్నారు. అయినా...

పెట్రోల్‌, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులకు ఏమి చెయ్యాలో అర్ధం కాక వాహనాలు బయటికి తీయకూండా బస్సుల్లో , ఆటోల్లో వెళుతున్నారు. అయినా ఆయిల్ కంపీనీలు దిగిరావడం లేదు.. రోజుకో విధంగా రేట్లను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో 35 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.81.63కి చేరింది. మరోవైపు డీజిల్ ధర 24 పైసలు పెరిగి రూ. 73.54కి చేరింది. అలాగే దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో 34 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.90కి 99 పైసల దూరంలో నిలిచింది ఇక డీజిల్ ధర 25 పైసలు పెరిగి రూ.78.07కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.86.18 డీజిల్ ధర రూ.79.73, ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ. 85.41డీజిల్ ధర రూ.78.63 గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories