వరుస ట్వీట్ లతో బాబుపై కౌంటర్లు పేలుస్తున్న వర్మ...

వరుస ట్వీట్ లతో బాబుపై కౌంటర్లు పేలుస్తున్న వర్మ...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరవాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్ లతో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పై వరుసగా కౌంటర్లు వేస్తూన్నారు . వర్మ ...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరవాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్ లతో రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పై వరుసగా కౌంటర్లు వేస్తూన్నారు . వర్మ చేసిన కొన్ని ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వీపరితంగా పెలుతున్నాయ్ ..

ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారు చంద్రబాబు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం అప్పుడు హాట్ హాట్ చర్చలకు దారితీసింది. అయితే వర్మ తనదైన స్టైల్ లో చంద్రబాబుకు చురకలంటిస్తున్నారు.

తన కొడుకు చెప్పాడని పేర్కొంటూ తెలుగు దేశం పార్టీ ఓటమిపై వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియా సెన్సేషన్ అవుతోంది. గాలిపోయిన సైకిల్ పక్కన ఏదో ఆలోచిస్తూ బాధగా కూర్చున్న చంద్రబాబు ఫోటో పెట్టిన వర్మ.. దానికి ''నా కొడుకు చెప్పాడు.. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయడానికి కారణం పోలింగ్ బూత్‌లో హాట్‌గా ఉండటమే'' అని కాప్షన్ పెట్టారు. ఈ వెరైటీ ట్వీట్ చంద్రబాబును నవ్వుల పాలు చేస్తోంది.

ఇక ముఖం నిండా చెమటలతో ఉన్న జగన్ పిక్ షేర్ చేసిన వర్మ.. ''10 సంవత్సరాలుగా జగన్ లోని ఎమోషన్ ని సెన్సార్ చేసిన తాజా పిక్ ఇది. దమ్ముంటే చంద్రబాబుకు సంబంధించి యెలాంటి పిక్ ఉంటే షేర్ చేయండి.. ఛాలెంజ్'' అని పేర్కొనడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories