పెట్రోల్ ధరలు భారీగా తగ్గింపు.. కేంద్రం సంచలన నిర్ణయం...

పెట్రోల్ ధరలు భారీగా తగ్గింపు.. కేంద్రం సంచలన నిర్ణయం...
x
Highlights

పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సామాన్యుడికి భారీ ఊరట కల్పించింది. ఆయిల్ పై వసూలు చేస్తున్న ఎక్సైజ్...

పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సామాన్యుడికి భారీ ఊరట కల్పించింది. ఆయిల్ పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని రూపాయిన్నర వరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూపాయి తగ్గించనున్నట్టు తెలిపాయి. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై సామాన్యుడికి రెండున్నర రూపాయిల వరకు ఉపశమనం కలగనుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ధరలను తగ్గించాలని కేంద్రం సూచనలు చేసింది. వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రెండున్నర రూపాయిల వరకు తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు జైట్లీ తెలిపారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.10వేల 500 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం బాటలో నడిస్తే ఆయిల్ ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories