ప్రజారాజ్యంతో జనసేనని పోల్చితే ఎలాగండి ..!

ప్రజారాజ్యంతో జనసేనని పోల్చితే ఎలాగండి ..!
x
Highlights

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిస్తుంది అనుకుంటే అందుకు భిన్నంగా అ పార్టీకి ఫలితాలు వచ్చాయి .. ఎక్కడ కూడా ఆధిక్యతను...

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిస్తుంది అనుకుంటే అందుకు భిన్నంగా అ పార్టీకి ఫలితాలు వచ్చాయి .. ఎక్కడ కూడా ఆధిక్యతను ప్రదర్శించలేదు జనసేన .. ఒక్క రాజోల్లో మాత్రమే జనసేన గెలిచింది. తమకు వచ్చిన ఓట్లను మరియు సీట్లను చూసి జనసేన అవాక్కు అయ్యే పరిస్థితి నెలకొంది .

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతోనూ జనసేనను పోల్చలేని పరిస్థితి. అ ఎనికల్లో ప్రజారాజ్యం పార్టీ మొత్తం 18 సీట్లను గెలుచుకుంది . ఇక ఈ ఏపీ ఎన్నికల మొత్తంలో 3.13 కోట్ల ఓట్లు పోలైతే.. జనసేనకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే నమోదు కావటం విశేషం ..ఈ 21 లక్షల ఓట్లలో వచ్చివన్నీ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి.

ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఏపీలోని పదకొండు జిల్లాల్లో జనసేనకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ కావటం..2009 ఎనికల్లో ప్రజారాజ్యం గెలిచిన స్థానాల్లో ఈ సారి జనసేన అభ్యర్ధులు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు ..

జనసేన మొత్తం మూడు స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. వాటిల్లో రెండు జనసేన అధినేత పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక స్థానాలు కావటం మరో విశేషం .. ఆ పార్టీ మొత్తం 136 స్థానాల్లో పోటీ చేస్తే 120 స్థానాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పాయారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories