‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’..సంచలన ట్వీట్స్‌తో బెంబేలెత్తిస్తున్న పవన్

Submitted by arun on Sat, 04/21/2018 - 11:35
pk

టాలీవుడ్‌లో ట్వీట్‌ల సెగను మరోసారి రాజేశారు జనసేనాని. శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వివాదంలో తనను లాగడం వెనక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన పవన్ .. దీనికి సంబంధించి పలు ట్వీట్‌లు చేశారు.  ఇది అనుకోకుండా జరిగిన వ్యవహారం కాదని  పక్కా ప్లాన్ ద్వారా ముందే రచించిన స్క్రిప్ట్  ప్రకారం జరిగిన వ్యవహారమంటూ ట్వీట్ చేశారు. మొత్తం ఎపిసోడ్‌లో కనబడుతున్న పాత్రధారుల కంటే వెనకున్న బడాబాబులే కీలకపాత్ర పోషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్లతో  పవన్ కల్యాణ్ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు. ఒక ట్వీట్‌లో బట్టలు విప్పి మాట్లాడుకుందాం అన్న పవన్ మరో ట్వీట్‌లో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఒకరు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? అంటూ సంచలన ట్వీట్ చేశారు. పవన్ వరుస ట్వీట్స్.. ఆయన మాటల్లోనే...
 
‘‘స్టే ట్యూన్డ్ టు ‘బట్టలు విప్పి మాట్లాడుకుందాం’ ప్రోగ్రాం నుంచి పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విటర్. ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ ‘అజ్ఞ్యాతవాసి’ని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని ‘ఒకరి’తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, ‘ఒకరు’ ఎవరు.. తెలుసుకోవాలని ఉందా!! స్టే ట్యూన్డ్! లైవ్ ఫ్రం హైదరాబాద్! ‘నిజాల నిగ్గు తేలుద్దాం’ ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్. నాకు ఇష్టమైన స్లోగన్ ‘‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి’’ అసలు ఈ స్లోగన్ వెనుక కథకి ఈ స్లోగన్‌కి సంబంధం ఏంటి? నిజమైన ‘అజ్ఞ్యాతవాసి’ ఎవరో మీకు తెలుసా?’’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు పవన్ కల్యాణ్.

English Title
pawankalyan tweets

MORE FROM AUTHOR

RELATED ARTICLES