ధర్మపురిలో యాదాద్రి తరహా ఘోరాలు..ధర్మపురిలో వెలుగుచూసిన చీకటి కోణం...

ధర్మపురిలో యాదాద్రి తరహా ఘోరాలు..ధర్మపురిలో వెలుగుచూసిన చీకటి కోణం...
x
Highlights

యాదాద్రి ఘోరాలింకా మది నుంచి చెదిరిపోనేలేదు అలాంటి దారుణాలు కనిపిస్తూనే ఉన్నాయి. పేగు తడి ఆరకముందే నీచమైన కుంపట్లోకి నెట్టేస్తున్న కర్కషకులు కళ్లముందే...

యాదాద్రి ఘోరాలింకా మది నుంచి చెదిరిపోనేలేదు అలాంటి దారుణాలు కనిపిస్తూనే ఉన్నాయి. పేగు తడి ఆరకముందే నీచమైన కుంపట్లోకి నెట్టేస్తున్న కర్కషకులు కళ్లముందే కనిపిస్తున్నారు. పదేళ్లు దాటాయా అంతే పడుపువృత్తిలోకి దించుతున్నారు. తాజాగా ధర్మపురిలో వెలుగుచూసిన చీకటి కోణంపై ప్రత్యేక కథనం.

సొంత పిల్లల్లా పెంచుతారు

కావాల్సినవన్నీ కొనిస్తారు

చెప్పినట్లు వినేలా భయంలో పెట్టుకుంటారు

లేదంటే ప్రాణం తీసేందుకైనా తెగిస్తారు

వయస్సుకొచ్చిందంటే చాలు పడుపు వృత్తిలో పడేస్తారు

సరిగ్గా ఇలాంటి మనుషులు మరోసారి వెలుగులోకొచ్చారు. సంచలనం సృష్టించిన యాదాద్రి ఘోరం లాంటిదే మరొకటి బయటపడింది. ఈ సారి మరో పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో వ్యభిచార గృహాలు గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయి. విషయం పోలీసులకు తెలిసినా చూసీ చూడనట్లే ఉన్నారు. దీంతో ఈ వృత్తినే నమ్ముకుని పెద్ద సంఖ్యలో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే తాజాగా ఆయా కుటుంబాల్లో బాలికలు కనిపించడం కలకలం రేపుతోంది. అనాధ ఆడ పిల్లలే లక్ష్యంగా చేరదీసి వారిని స్థానికంగానే చదివించి ఈ నీచవృత్తిలోకి నెడుతున్నారు. వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారు.

ఎలాంటి వివరాల్లేని ఐదేళ్ల లోపు పిల్లలను చేరదీసి చదువు చెప్పిస్తున్నారు. అలా చదువుకున్న వారిలో కొందరు టెన్త్‌, మరికొందరు ఇంటర్‌ కూడా పూర్తి చేశారు. సొంత పిల్లల్లా పెంచి అదే వృత్తిలోకి దించుతున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఇటీవలే దాడులు చేసి ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఈ వృత్తిలో మరికొందరు మైనర్లున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే దాడుల్లో పట్టుబడ్డ పిల్లల డీఎన్‌ఏ వారి తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వారి డీఎన్‌ఏతో సరిపోల్చేందుకు పరీక్షలు చేయిస్తున్నారు. ఒకవేళ పిల్లలు నిర్వాహకులకు సంబంధించిన వారు కాకపోతే.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? వారి సొంత ప్రదేశాలేవనే విషయాలను ఆరా తీయనున్నారు. వీరి వెనుక వేరే ఏదైనా ముఠా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories