పవన్‌ కళ్యాణ్‌పై ఆకుల ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌ కళ్యాణ్‌పై ఆకుల ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆకుల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదని ఆకుల వ్యాఖ్యానించారు....

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆకుల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదని ఆకుల వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్‌కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైనట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే నిన్నటి నుండి ఆకుల సత్యనారాయణ జనసేనకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరుతారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిచిన ఆకుల సత్యనారాయణ తనకు ఇప్పడు పార్టీ మారే ఆలోచన లేనే లేదని స్సష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories