మరి.. జగన్‌ను మోదీ నడిపిస్తున్నారా?: పవన్‌కల్యాణ్

Submitted by arun on Tue, 03/13/2018 - 08:24
pk

జనసేన టీడీపీలో అంతర్భాగమని, జనసేనకు కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబేనంటూ జగన్ చేసిన విమర్శలను పవన్ తిప్పికొట్టారు. మరోవైపు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇంటిని నిర్మించనున్నారు. కొత్త ఇంటికి నిర్మాణానికి భార్య అన్నా లెజినోవాతో కలిసి నిన్న భూమి పూజ చేశారు. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గుంటూరులో సొంతింటి నిర్మాణానికి పూజలు నిర్వహించారు. కొత్తింటి నిర్మాణానికి హోమం నిర్వహించి భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్‌ కల్యాణ్‌ పూజలు నిర్వహించారు. మంగళగిరిలో తన తండ్రి కానిస్టేబుల్‌గా పని చేశారని చెప్పుకున్న పవన్ కల్యాణ్‌ ఆయన పని చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటి స్థలాన్ని అభిమానులే చూపించారని తెలిపారు. సాహితి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఇంటిని నిర్మిస్తోందన్నారు. రెండు ఎకరాల స్థలంలో ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే అమరావతిలో ఇంటిని నిర్మిస్తున్నట్లు పవన్‌ తెలిపారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తలపెట్టిన పార్టీ ఆవిర్భావ సభ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. నాగార్జున యూనివర్శిటీ వద్ద ఈ నెల 14న నిర్వహించే సభకు సంబంధించిన జనసేన అవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పవన్‌ కళ్యాణ్ పరిశీలించారు. సభా వేదిక ఏర్పాట్ల గురించి పవన్‌ కల్యాణ్‌ నేతలను అడిగి తెలుసుకున్నారు. సభావేదిక ఎక్కి ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతపురం, కాకినాడ సభల్లో జరిగిన సంఘటనలు ఇక్కడ పునరావృతం కానివ్వొద్దని నేతలకు సూచించారు. సభకు వచ్చే కార్యకర్తల కోసం ఏర్పాటుచేసి సౌకర్యాలపై పవన్ ఆరా తీశారు. సమస్యలు మరిచిపోనని అభిప్రాయాలను దాచుకోనని 14న అన్ని విషయాలకు క్లారిటీ ఇస్తానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి మోదీ అనుకోవాలా అంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునే ఎందుకు అనుకోవాలి? బీజేపీని కూడా ఆవిధంగా అనుకోవచ్చుకదా? అని పవన్ వ్యాఖ్యానించారు. ఒక మాట అనడం సులభమని, రాజకీయ నేతలు ఆలోచించి మాట్లాడాలని పవన్ సూచించారు.

English Title
Pawan to make key announcement on March 14 Acharya Nagarjuna University public meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES