విస్మ‌యానికి గురిచేస్తున్న ప‌వ‌న్

విస్మ‌యానికి గురిచేస్తున్న ప‌వ‌న్
x
Highlights

ప్రస్తుత రాజకీయాల పరిణామాల నేపధ్యంలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వ్యవస్థ మీద సామాన్యుడికి సైతం విస్మయాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు...


ప్రస్తుత రాజకీయాల పరిణామాల నేపధ్యంలో పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వ్యవస్థ మీద సామాన్యుడికి సైతం విస్మయాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు.పవన్ ఏపీలో చంద్రబాబు తో జట్టు కట్టడం ఇక్కడ పర్యటనలు చేస్తూ ఉండటం సమస్యలని ప్రభుత్వం ద్వారా పరిష్కరించడం అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణా ఎపిసోడ్ తో ఇప్పుడు పవన్ వ్యక్తిత్వంపై ఏపీ ప్రజలకి మాత్రం చిరాకు కలిగిస్తోంది..చంద్రబాబు లాంటి నాయకుడిని పవన్ పక్కన చూడలేము అంటున్నారు..కేసీఆర్ అంటే తెలంగాణా ప్రజలకి దేవుడు అయ్యిఉండవచ్చు కానీ ఏపీ ప్రజలకి మాత్రం కాదు. కేసీఆర్ ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వ్యక్తిని పవన్ కూడా ఎన్నో సార్లు నోటికి వచ్చిన మాటలు అన్నాడు. అయితే ఇప్పుడు అదే నోటితో బెస్ట్ సీఎం ,స్మార్ట్ సీఎం అని పొగుడుతూ ఉంటే ఏపీ ప్రజలు ఎలా పవన్ కి మద్దతు ఇస్తారు..? పవన్ కేసీఆర్ పై ప్రేమ కురిపించడం బెస్ట్ సీయం అనడం ఏపీ సీఎం మీద రాబోయే మరియు భవిష్యత్తు టిడిపి రాజకీయాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని వేరే చెప్పవలసిన అవసరం లేదు.. టీడీపీ పవన్ తో పొత్తు పెట్టుకోవాలని చుస్తే చంద్రబాబు చరిష్మాకే నష్టం అని అంటున్నారు..ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియని నాయకుడితో అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు దోస్తీ చాలా మంది టిడిపి నాయకులకి నచ్చడం లేదట..ఒక పక్క చంద్రబాబు కరువు సీమకి నీళ్లు ఇచ్చి ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేస్తే అనంతపురం కరువు జిల్లా త్వరలో అక్కడ సమస్యలపై సమరం చేస్తా అంటూ మాట్లాడటం అతని అజ్ఞానానికి నిదర్శ‌నం అంటున్నారు.

పవన్ లేకుండానే నంద్యాల ,కాకినాడలో చంద్రబాబు చక్రం తిప్పి అక్కడ సీట్లు గెలుచుకోలేదా.. మునిసిపల్ ఎలక్షన్లలో పవన్ సాయం లేకుండా టిడిపి జెండా ఎగురవేయలేదా. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే వచ్చిన ఓట్లు శాతం కూడా ఎంతో తక్కువ అలాంటప్పుడు చంద్రబాబు చరిష్మతోనే జనంలోకి వెళ్తే టిడిపికి బలం ఉంటుందని..ఈసారి కూడా పవన్ తో నడిస్తే టిడిపి గెలిచినా అది పవన్ క్రెడిట్ లోకే వెళ్ళిపోతుందని ఈ విషయంలో చంద్రబాబు అలోచించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు

Show Full Article
Print Article
Next Story
More Stories