2019 ఎన్నికలకు పక్కా వ్యూహంతో జనసేనాని అడుగులు

Submitted by arun on Thu, 06/14/2018 - 10:58
pk

2019 ఎన్నికల బరిలో దిగాలని జనసేన గట్టిగా ఫిక్సైంది. అందుకు.. ప్రజల మద్దతొక్కటే సరిపోదని రియలైజ్ అయ్యింది. పార్టీని నడపటానికి డబ్బులు కూడా అవసరమని భావించి.. ఫండ్స్ సేకరించే పనిలో పడింది నాయకత్వం. పార్టీ ఫండ్స్ కోసం.. జనసేన కొత్త రూట్ ఎంచుకుంది. విరాళాల కోసం.. ఏకంగా ఆన్‌లైన్‌లో కౌంటర్ తెరిచారు. అసలేంటీ.. జనసేన ప్లాన్..? 

2014 ఎన్నికల నాటికి పార్టీ పెట్టేశారు. కానీ.. ఆ ఏడాది ఎలక్షన్లలో పోటీకి దిగకుండా.. టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. కానీ.. ఈసారి సీన్ మారిపోయింది. సిచ్యువేషన్ మొత్తమే ఛేంజ్ అయ్యింది. 2019 ఎన్నికలకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది జనసేన నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యింది పవన్ పార్టీ. అందుకోసం.. ఇప్పటి నుంచే అభ్యర్థుల వేటలో ఉన్నారు పార్టీ నాయకులు. ఎలక్షన్లు దగ్గరపడుతున్న కొద్దీ.. పార్టీ నడిపేందుకు ప్రజల మద్దతు ఒక్కటే ఉంటే సరిపోదు.. ఫండ్స్ కూడా కావాలని తెలుసుకున్నారు. అందుకు.. ఆన్‌లైన్‌లోనే డొనేషన్ల సేకరణ ప్రారంభించారు.
                           
ఇప్పటికే అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఆర్థిక, అంగబలాలతో ఎన్నికలకు రెడీగా ఉన్నాయి. కానీ.. జనసేన మాత్రం తమకు ప్రజల మద్దతే ప్రధానమనే రీతిలో ఎలక్షన్లకు రెడీ అయ్యింది. కానీ.. ఎన్నికలంటే ఎంతో కొంత నిధులు అవసరం. అందువల్ల.. నేరుగా ప్రజల నుంచే విరాళాలు సేకరించేందుకు సిద్ధమైంది. స్వీకరించిన పార్టీ ఫండ్స్.. ఎప్పుడు, ఎలా ఖర్చుపెట్టామో కూడా డొనేషన్లు ఇచ్చినవారికి తెలియజేస్తామంటోంది జనసేన.

రాష్ట్రంలో జనసేన తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థికి.. ఎన్ఆర్ఐ నిధులు సమకూర్చేలా సేనాని ప్రణాళిక రచిస్తున్నారు. ఈ బాధ్యతలను పార్టీ ప్రధానకార్యదర్శి తోట చంద్రశేఖర్‌కు అప్పగించారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేందుకు.. భారీగా నిధులు సమీకరించి అభాసుపాలైన నేపథ్యంలో.. పార్టీ ఫండ్స్ విషయంలో.. ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు ఆన్‌లైన్‌లో వివరాలు ఉండేలా జనసేన ప్లాన్ చేస్తోంది.

English Title
Pawan Kalyan Political Strategy For 2019 Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES