కూల్ కిల్లింగ్...ఐస్ కలిపిన పానీయాలు, జ్యూస్‌తో జాగ్రత్త

కూల్ కిల్లింగ్...ఐస్ కలిపిన పానీయాలు, జ్యూస్‌తో జాగ్రత్త
x
Highlights

ఎండ కాలం వచ్చిందంటే చాలు శీతల పానీయాల వైపు మనసు లాగుతుంది. ఐస్ వేసిన జ్యూస్ లు తాగితే వేసవి తాపం నుండి బయటపడి హమ్మయ్య అనిపిస్తుంది. అయితే అపరిశుభ్రమైన...

ఎండ కాలం వచ్చిందంటే చాలు శీతల పానీయాల వైపు మనసు లాగుతుంది. ఐస్ వేసిన జ్యూస్ లు తాగితే వేసవి తాపం నుండి బయటపడి హమ్మయ్య అనిపిస్తుంది. అయితే అపరిశుభ్రమైన ఐస్ వ్యాధులకు గురి చేస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా హరిస్తుంది. విశాఖలోని ఐస్ ఫ్యాక్టరీలపై స్పెషల్ స్టోరీ.

వేసవి వచ్చిందంటే చాలు ఉష్ణతాపం నుండి బయటపడేందుకు చాలామంది చల్లటి పదార్ధాల వెంటపడతారు. ఐస్ వేసిన పళ్లరసాలు, పానీయాలను ఇష్టంగా తాగుతుంటారు. ఐస్ అపరిశుభ్రత వాతావరణంలో తయారీ అవుతుందన్న విషయం తెలియదు. చాలా చోట్ల ఐస్ ఫ్యాక్టరీలలో మురికి నీరు, తుప్పు పట్టిన ఇనుప యంత్రాల మధ్య ఐస్ తయారు అవుతుంది

విశాఖపట్నంలో కేవలం రెండు ఫ్యాక్టరీలకు మాత్రమే ఐస్ తయారీకి అనుమతి ఉంది. మిగిలినవన్నీ ఫషింగ్ ఇండస్ట్రీలు, ఇండస్ట్రీయల్ పర్పస్ కోసం అనుమతులు కలిగివున్నాయి. అపరిశుభ్రత వాతావరణంలో ఐస్ తయారీ అవుతోంది. తక్కువ రేటుకు లభ్యం అవుతున్న నాణ్యత లేని ఐస్ ను చాలా మంది వ్యాపారులు శీతలపానీయాలు, పళ్ల రసాలలో యదేచ్ఛగా వాడుతున్నారు. వీటిని తాగుతున్న జనం అనారోగ్యం పాలవుతున్నారు.

నాణ్యత లేని ఐస్ తీసుకుంటే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లేనని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నీరు శుభ్రంగా లేనప్పుడు వైరల్ ఇన్ ఫెక్షన్స్ సోకుతాయని చెబుతున్నారు కీడ్నీ, లీవర్ తదితర వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. జనం ఎండ వేడిమిని తట్టుకోవడానికో లేదా చౌకగా దొరుకుతున్నాయనో ఐస్ ను వాడేస్తున్నారు. అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. వేసవి తాపం తగ్గించేుకునేందుకు ఐస్ లేకుండా చల్లటి పానీయాలు, పళ్ల రసాలు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories