నా ఖర్మ సరిగ్గా లేక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది: పవన్

x
Highlights

మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సమస్యలపై నేను...

మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సమస్యలపై నేను నేతలను నిలదీస్తుంటే మూడు పెళ్లిళ్లంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా ఖర్మ సరిగ్గా లేక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని, ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదని చెప్పారు. నాపై విమర్శలు చేసే నేతల్లాగా ఒక పెళ్లి చేసుకుని మీలాగే బాలాదూర్‌గా తిరగడం లేదని మండిపడ్డారు. నాతో కలిసి జీవించాలంటే ఎవరికైనా కష్టమేనని, తనకు పబ్బులు, ఫంక్షన్లు లాంటి సంతోషాలుండవని చెప్పారు. ఇంట్లో ఉన్నా, ఎక్కడా ఉన్నా నిత్యం ప్రజా సమస్యల గురించే తాను ఆలోచిస్తానన్నారు పవన్ కల్యాణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories