మొదలైన సూర్యుడి వేట....భానుడి భగభగల గుట్టు విప్పేందుకు..నాసా ప్రోబ్

మొదలైన సూర్యుడి వేట....భానుడి భగభగల గుట్టు విప్పేందుకు..నాసా ప్రోబ్
x
Highlights

సూర్యుడి దగ్గరకి వెళ్లడానికి ఎవరికైనా పప్పులు ఉడకవు. ఒకవేళ ప్రయత్నం చేసినా మాడిపోతారు మసైపోతాయి. కనీసం ఆ మసి కూడా మిగల్దని తెలియన్దేముందీ ఎందుకంటే...

సూర్యుడి దగ్గరకి వెళ్లడానికి ఎవరికైనా పప్పులు ఉడకవు. ఒకవేళ ప్రయత్నం చేసినా మాడిపోతారు మసైపోతాయి. కనీసం ఆ మసి కూడా మిగల్దని తెలియన్దేముందీ ఎందుకంటే అక్కడ ఉండేది మామూలు హీటేం కాదు కదా. అయితే అంత హీట్‌కి కారణమేంటో తెలుసుకోనుంది నాసా. అసలు నాసాకెందుకు ఇంత కూల్‌ థాట్‌ వచ్చిందో తెలియదు కానీ భారీ స్కెచ్‌ వేసి మహోజ్వాల బింబం మిస్టరీని చేధించే పనిలో నిమగ్నమైంది.

nasa parker solar probe rocket launch successful - Sakshi

భగభగమండే సూర్యుడి సంగతేంటో తేలనుంది. అగ్నిగోళాన్ని తలపించే సూర్యుడి భగభగల మిస్టరీ వీడనుంది. భాస్కరుడిలో దాగి ఉన్న అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం చిక్కనుంది. సూర్యబింబ రహస్యాల లెక్కేంటో తేల్చేందుకు రెడీ అయింది నాసా. అయస్కాంత శక్తితో కల్లోలంగా ఉండే సూర్యుడు ఎందుకలా ఒక్కోసారి ప్రచండ వేడితో విరుచుకుపడుతాడన్న మానవుడి అనాది సంశయాలకు సమాధానాలను అన్వేషించేందుకు వేట మొదలైంది. భూమికి, సూర్యుడికి మధ్య అల్లిబిల్లి తిరుగుతూ అక్కడి భానుమూర్తి రహస్యాల గుట్టును తెలుసుకునేందుకు సాహస యాత్ర చేపట్టింది నాసా.

Nasa2

దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన భాను బింబంలో దాగి ఉన్న అంతుచిక్కని మర్మాలు రోబో సాయంతో తెలసుకోనుంది .భానుడితో పాటు సౌర కుటుంబంలోని గ్రహాలు, గ్రహశకలాలు సుడులు తిరుగుతున్న ఒక భారీ శీతల వాయు, సోలార్‌ నెబ్యులా నుంచి పురుడుపోసుకున్న తీరు బట్టబయలు చేయనుంది. సూర్యుడి గురించి విప్పబోయే రహస్యాల ద్వారా సౌరతుపాన్లు వంటి విపరీత పరిణామాల బారి నుంచి మన విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, ఉపగ్రహాలు, వ్యోమగాములను భద్రంగా రక్షించుకోవచ్చని మన శాస్రవేత్తలు బావిస్తున్నారు.

పాలపుంత గెలాక్సి నడి మధ్య భాగానికి 25 వేల కాంతి సంవత్సరాల దూరంలోని ప్రదేశమే మన భానుడి నివాసం. అలాంటి సూర్యుడు ఉత్పత్తి చేసే మొత్తం శక్తిలో మన భూమిని చేరుతోంది వంద కోట్లలో ఒక వంతు మాత్రమే. అలాంటి సూర్యడి మీద ఏముంటుందనే మిస్టరీని కనుగొనేపని పడ్డారు.

మానవుడి అనాది సంశయాలకు సమాధానాలను అన్వేషించేందుకు సూర్యుడి చుట్టూ ఉండే భీతావహ వాతావరణ పొరను నాసా వ్యోమనౌక ‘పార్కర్‌ ప్రోబ్‌’ ప్రయాణం ఆరంభించింది. భూ కక్ష్యలోకి చేరిన ఇది క్రమంగా భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న నిగూఢ సమాచారాన్ని మనకు పంపిస్తుంది. మరి ఆ మండే అగ్నిగోళం దగ్గర ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి.

దాదాపు 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది సూర్యగోళం. పాలపుంత గెలాక్సీ నడి మధ్య భాగానికి 25 వేల కాంతి సంవత్సరాల దూరంలోని ప్రదేశమే మన భానుడి నివాసం. అలాంటి సూర్యుడి సామ్రాజ్యంలో ఓ తార అంతమైనప్పుడు సంభవించిన సూపర్‌నోవా విస్ఫోటం నుంచి ఏర్పడిందీ సోలార్‌ నెబ్యులా. కానీ వెలుపలి ఒత్తిడి దానికి ఉండే స్వీయ గురుత్వాకర్షణ శక్తిల వల్ల ఈ ధూళి మేఘం కుచించుకుపోవడం మొదలై మెల్లగా దాని మధ్య భాగం సూర్యుడిగా రూపాంతరం చెందింది.

మిగిలిన స్వల్ప మొత్తం ఒక డిస్క్‌లా ఏర్పడి అంతిమంగా అదే మన భూమి, ఇతర గ్రహాలుగా రూపాంతరం చెందింది. కానీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సూర్యుడు మరింత కుంచించుకుపోయాడు. ఈ క్రమంలో దాని మధ్య కోర్ భాగంలో ఉష్ణోగ్రతలు 27 మిలియన్‌ డిగ్రీల ఫారన్‌హైట్‌కు చేరుకున్నాయి. ఈ వేడి వల్ల నాలుగు హైడ్రోజన్‌ ప్రోటాన్లు పరస్పరం కలసిపోయి ఒక హీలియం కేంద్రకంగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొంత శక్తి కూడా వెలువడేదాన్నే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ అంటారు.

సూర్యుడు ప్రతి సెకనుకు 700 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ను 695 మిలియన్‌ టన్నుల హీలియం వాయువుగా మార్చేస్తుంటాడు. మిగతా 5 టన్నులు శక్తి రూపంలో వెలువడుతుంది. ఈ ప్రభాత శక్తి ఫోటాన్‌ అనే కాంతి రేణువు రూపంలో ఉంటుంది. అక్కడి హైడ్రోజన్‌ సెకను సెకనుకూ ఇంత భారీగా వినియోగం అయిపోతున్నప్పటికీ సూర్యుడిలో మరో 500 కోట్ల ఏళ్ల వరకూ సరిపడా హైడ్రోజన్‌ నిల్వలు ఉంటాయి. సూర్యుడికికే గనక అపార గురుత్వాకర్షణ శక్తి లేకుంటే ఇదంతా భారీ హైడ్రోజన్‌ బాంబు తరహాలో పేలిపోయేది.

వాచిస్‌ సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువేగానీ కరోనాలో తీవ్రస్థాయిలో వేడెక్కిన వాయువులను ఒడిసిపట్టేంతటి స్థాయిలో మాత్రం అది ఉండదు. అందుకే అక్కడ రేణువులు వేగంగా అంతరిక్షంలోకి దూసుకెళుతుంటాయి. వీటినే ‘సౌర గాలులు’ అంటారు. ఈ గాలులు మన సౌర కుటుంబం అంచుల వరకూ కూడా వీస్తూనే ఉంటాయి.

సూర్యుడిపై మచ్చలు ఒక వింతనే చెప్పాలి. సూర్యుడి భ్రమణం, అయస్కాంత క్షేత్రాల మధ్య ఉండే తేడాల వల్ల ఫొటోస్పియర్‌లో కొన్ని మచ్చలు కనబడతాయి. పెద్ద మచ్చల్లో బలమైన అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి. ఇవి భీకర జ్వాలలను వెలువరిస్తుంటాయి. ఆ భారీ జ్వాలలోని శక్తితో అమెరికా వంటి దేశానికి లక్ష ఏళ్ల పాటు కరెంటు అందించొచ్చు. సౌరమచ్చల సంఖ్య ఒక నిర్ణీత కాలచక్రం ప్రకారం పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. ఈ కాలచక్రం నిడివి 11 ఏళ్లు.

సూర్యుడు ఉత్పత్తి చేసే మొత్తం శక్తిలో మన భూమిని చేరుతున్నది వంద కోట్లలో ఒక వంతు మాత్రమే. కోర్ భాగంలో ఉత్పత్తయిన ఫోటాన్లు రేడియేటివ్‌ జోన్‌లోకి చేరుకుంటాయి. అక్కడ వీటి ప్రయాణం చాలా జిగ్‌జాగ్‌ మార్గంలో అటూఇటూ కదులుతూ సాగుతుంది. అలా ఆ పొర నుంచి ఫోటాన్‌ బయటకు రావడానికి ఏకంగా 10 లక్షల ఏళ్లు పడుతుందట. ఆ తర్వాత కన్వెక్షన్‌ జోన్‌లో వేగంగా దాని ప్రయాణం సాగుతుంది. ఈ పొరకు పైన ఉండే ఫొటోస్పియర్‌కు చేరుకున్నాక 8 నిమిషాల 20 సెకన్లలో భూమిని చేరుతుంది. అంటే ఇప్పుడు మన మీద పడిన సూర్యకాంతి మనం ఆస్వాదిస్తున్న నులివెచ్చటి సూర్యకాంతి దాదాపు 10 లక్షల ఏళ్ల కిందట సూర్యుడిలో ఉత్పత్తయ్యిందన్నమాట.

విశ్వంలో మిస్టరీలను ఒక్కొక్కటిగా చేధిస్తున్న మానవుడికి సూర్యుడి దగ్గరికి వెళ్లాలనేది ఎప్పటి నుంచో తీరని కల. వేల డిగ్రీల సూర్యతాపాన్ని తట్టుకొని దగ్గరకు వెళ్లే పరిజ్ఞానాన్ని సాధించేందుకు ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ అన్వేషణలో అమెరికా పరిశోధనా సంస్థ ముందడుగు వేసింది.

సూర్యుడి స్థితిగతులపై పరిశోధనలు చేస్తున్న ఖగోళ భౌతికశాస్త్రవేత్తలు కారు సైజులో ఉండే పార్కర్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపించి సూర్యుడి రహస్యాలను కనుగొనే పనిలో పడ్డారు. పార్కర్ ప్రోబ్ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి ఇది వెళ్లనుంది. ఈ ప్రాంతాన్ని కరోనా లేదా కాంతి వలయం అని పిలుస్తారు. ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. కరోనా నుంచి వెలువడే సౌరతుఫానులపైనా పరిశోధనలు చేస్తుంది. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సౌర తుఫాన్లు ఎలా పుడుతాయి..? వేగం ఎలా పెరుగుతుంది..? వంటి ప్రశ్నలకు పార్కర్ సమాధానాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా సౌరతుఫాన్ల నుంచి తప్పించుకోవడానికి గల మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు.

పార్కర్ ఏడు సంవత్సరాల పాటూ అంతరిక్షంలో ప్రయాణిస్తుంది. ప్రతి 88 రోజులకు ఒకసారి భ్రమణాన్ని పూర్తి చేస్తూ దాదాపు 24 సార్లు సూర్యుడి కరోనాను తాకుతుంది. కరోనాలోకి ప్రవేశించే సమయంలో సూర్యుడి ఆకర్షణ శక్తిని తప్పించుకునేందుకు ప్రోబ్ సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సూర్యుడి కరోనా ప్రాంతంలోని అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పార్కర్‌ను రూపొందించారు. పార్కర్‌కు అమర్చిన ఉష్ణకవచాలు గరిష్ఠంగా 1,370 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ప్రోబ్ చుట్టూ 11.43 సెంటీమీటర్ల మందంతో కార్బన్‌తో తయారైన హీట్‌ షీల్డ్‌ ను అమర్చారు. ఇవి భూమిని చేరే సూర్యుడి రేడియేషన్ కన్నా 500 రెట్లు అధిక రేడియేషన్‌ను తట్టుకోగలవు. బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నా ప్రోబ్ లోపల 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా రక్షణ ఇస్తాయి.

పార్కర్ ప్రోబ్ సూర్యుడిని చేరేందుకు గంటకు 4.3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నది. తద్వారా అత్యధిక వేగంతో ప్రయాణించిన మానవ నిర్మిత వాహనంగా రికార్డు సాధించనున్నది. ప్రోబ్‌లో అమర్చిన పరికరాలు సూర్యుడి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని, విద్యుత్ క్షేత్రాన్ని, శక్తివంతమైన తరంగాలను, శక్తి ఉత్పాదకాలను అధ్యయనం చేస్తాయి. ఇందులోని ఇమేజర్ ఫొటోలను తీస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories