తెలంగాణ యోగి...ఎంపీగా రంగంలోకి?

తెలంగాణ యోగి...ఎంపీగా రంగంలోకి?
x
Highlights

తెలంగాణ రాజకీయాలను బిజెపి కొత్త మలుపు తిప్పు తోందా? ఉత్తరాదిన హిట్ అయిన స్వామీజీల ఫార్ములాను దక్షిణాదినా వర్కవుట్ చేయాలని ప్రయత్నిస్తోందా? శ్రీ...

తెలంగాణ రాజకీయాలను బిజెపి కొత్త మలుపు తిప్పు తోందా? ఉత్తరాదిన హిట్ అయిన స్వామీజీల ఫార్ములాను దక్షిణాదినా వర్కవుట్ చేయాలని ప్రయత్నిస్తోందా? శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద ఎన్నికల రాజకీయాల్లోకి దిగుతారా?

దక్షిణాదిన కాలు పెట్టాలని తహతహలాడిన బిజెపికి కర్ణాటకలో తగిలిన ఎదురు దెబ్బ పట్టుదలను పెంచుతోంది. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో కొన్నైనా సీట్లు గెలుచుకోవాలనే ఎజెండాతో పనిచేస్తున్న కమలం ఇప్పటికే ప్రజాక్షేత్రంలో చైతన్య యాత్రలతో దూసుకుపోతోంది. టిఆరెస్ ను టార్గెట్ చేస్తూ కమలనాథులు కఠినంగా మాట్లాడుతున్నారు. బిజెపి గెలుపుకు రాజకీయ వ్యూహాలే కాదు. యూపీ తరహా ఫార్ములాను ఫాలో అవాలన్న ఆలోచనలు కూడా కమలనాథులు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ రాజకీయాల్లోకి రాకముందు ఇలాగే హిందూ ధర్మ రక్షణ ధ్యేయంతో పనిచేశారు. హిందూత్వ వాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. యూపిలోని ఘోరక్ నాథ్ మఠ వారసుడు అయిన యోగీ చాలా చిన్న వయసులోనే ఎంపీగా గెలుపొందారు. యూపీలో మత మార్పిడులను తగ్గించడానికి ఒక ఉద్యమంగా పనిచేశారు. హిందూమతం నుంచి క్రైస్తవులుగా మారిన వారిని మళ్లీ హిందూ మతంలోకి తీసుకొచ్చారు. హిందూ యువ వాహిని సంస్థ ద్వారా ధార్మిక బోధలు చేశారు యూపిలో బిజెపి పునర్వైభవానికి యోగీ చేసిన కృషి చెప్పుకోదగ్గది.. అలాగే అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో వినియోగించాలని కమలనాథులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తన బోధనలతో ప్రచారంలోకి వచ్చిన స్వామీ పరిపూర్ణానందను బిజెపి ఎన్నికల బరిలోకి దించుతుందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.

యోగీ ఆదిత్య నాధ్ కు పరిపూర్ణానందకు చాలా పోలికలు కలుస్తాయి. ఇద్దరూ 1972లోనే పుట్టారు. పరిపూర్ణానంద ధార్మిక బోధనలతో ప్రజల్లో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రీయ హిందూ సేనను స్థాపించి హైందవ ధర్మం గురించి బోధిస్తున్నారు. హిందూ మత ప్రచారం కోసం పరిపూర్ణానంద కూడా దేశ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడినందుకు క్రిటిక్ కత్తి మహేష్ ను ఆయన తూర్పారబట్టారు. ధర్మాగ్రహ పోరాటంతో తన నిరసనను తెలపాలనుకున్నారు కానీ రెండు వైపులా వాదోపవాదనలు ముదరడంతో పోలీసులు పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. కత్తి మహేష్ కు నగర బహిష్కరణ విధించారు. పరిపూర్ణానందను వదిలేశారన్న అపవాదును తిప్పి కొట్టడానికి పరిపూర్ణానంద పాత ప్రసంగాలను తవ్వి తీసి పోలీసులు కేసులు పెట్టారు. అంతేకాదు నగర బహిష్కరణ చేశారు. ఇలా వార్తల్లో వ్యక్తిగా పరిపూర్ణానంద మారారు మరోవైపు స్వామీజీలకు ఎక్కువ విలువ ఇచ్చే బిజెపి పరిపూర్ణానందను బిజెపి అభ్యర్ధిగా రానున్న ఎన్నికల్లో రంగంలోకి దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పరిపూర్ణానంద కోరుకుంటే పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు అభ్యంతరాలు లేవని బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ చెప్పారు. బిజెపి ప్రతిపాదనకు పరిపూర్ణానంద అంగీకరిస్తే ఆయన్ను సికింద్రాబాద్ ఎంపీగా రంగంలోకి దించుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories