రాహుల్‌గాంధీకి బ్రిటన్ పౌరసత్వం? నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ

రాహుల్‌గాంధీకి బ్రిటన్ పౌరసత్వం? నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
x
Highlights

కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీని పౌరసత్వ వివాదం వెంటాడుతోంది. రాహుల్ ద్వంద పౌరసత్వం కలిగి ఉన్నాడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కేంద్ర హోంశాఖకు...

కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీని పౌరసత్వ వివాదం వెంటాడుతోంది. రాహుల్ ద్వంద పౌరసత్వం కలిగి ఉన్నాడంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పలు కీలక పత్రాలను అందజేశారు. 2005 అక్టోబర్ 10 నుంచి 2006 అక్టోబర్ 31 మధ్య తన వార్షిక ఆదాయ వివరాలు లండన్ ఆదాయ పన్నుశాఖకు సమర్పించినట్టు ఆధారాలు అందజేశారు. ఇందులో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వివరాలు కూడా ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖకు వివరించారు.

సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుపై స్పందించిన రాహుల్ గాంధీకి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అమేథి నుంచి రాహుల్ దాఖలు చేసిన నామినేషన్‌పై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే దీనిపై రిటర్నింగ్ కోరిన పత్రాలు అందజేయడంతో నామినేషన్ ఆమోదం పొందింది. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉందని, భారతీయుడు కాని ఆయన భారత ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories