అదిరిపోయే పంచ్ ఇచ్చిన సూపర్ స్టార్

అదిరిపోయే పంచ్ ఇచ్చిన సూపర్ స్టార్
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు లోని స్పాంటేనిటీ, ఫన్నీ యాంగిల్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు...

సూపర్ స్టార్ మహేష్ బాబు లోని స్పాంటేనిటీ, ఫన్నీ యాంగిల్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మహేష్ బాబు వేసిన పంచ్ డైలాగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు ఒక్క హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాలో నటించబోతున్నాడు అనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. "మహేష్ - వంశీ పైడిపల్లి. మీరు లాస్ ఏంజెల్స్ కు వచ్చినప్పుడు డీటీఎల్ ఏ (డౌన్ టౌన్ లాస్ ఏంజెల్స్)లో దిగి నాతో భోజనానికి రండి." అని హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్ ట్వీట్ చేసినప్పటి నుంచి ఈ వార్త వైరల్ గా మారింది.

"ఇంటర్నేషనల్ స్పై సినిమా గురించి చర్చించుకుందాం`` అని బిల్ డ్యూక్ డైరెక్ట్ గానే చెప్పడం గమనార్హం. అంతే కాక మహేష్ .. మురుగదాస్ లాంటి వాళ్లు లండన్ లో దిగితే తనతో లంచ్ కి రావాల్సింది గా అడిగాడు. ఈ నేపథ్యంలో ఇంతకీ మహేష్ బాబు నిజంగా హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారా విషయం గురించి అడుగగా మహేష్ బాబు సింపుల్ గా "ఆయన ఖాళీగా ఉన్నాడేమో అందుకే ట్వీట్లు చేస్తున్నాడు" అని సరదాగా నవ్వేశారు. ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాలన్న కల ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఏదో ఒక హాలీవుడ్ నటుడు పిలిచాడని వెళ్లిపోవడం అంత కరెక్ట్ కాదని మహేష్ బాబు భావించి ఉంటారు. ఇక మరో వైపు మహేష్ బాబు కెరీర్లో 25 వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'మహర్షి' సినిమా ఈనెల 9వ తారీఖున విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories