రాజీనామా చేయనున్న మంత్రి కిడారి శ్రవణ్‌!

రాజీనామా చేయనున్న మంత్రి కిడారి శ్రవణ్‌!
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా నియమితులై ఆరు నెలలవుతున్నా...

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా నియమితులై ఆరు నెలలవుతున్నా ఇప్పటికీ చట్టసభల్లో సభ్యుడు కాకపోవడమే దీనికి కారణం. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుమారుడు కిడారి శ్రవణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2018 నవంబరు 11న గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఈ నెల పదో తేదీకి ఆయన పదవి చేపట్టి ఆరు నెలలు నిండుతుంది. రాజ్యాంగం ప్రకారం మంత్రిగా ప్రమాణం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. లేదంటే పదవి కోల్పోతారు. గవర్నర్‌ కార్యాలయం ఇదే అంశాన్ని తెలియజేస్తూ శ్రావణ్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. దీంతో ఆయన రాజీనామా అనివార్యమైంది. మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్‌ కుమార్‌ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories