హాజీపూర్‌ ఆగ్రహం...టీఆర్‌ఎస్‌ నాయకుల్ని నిలదీసిన గ్రామస్తులు..!

హాజీపూర్‌ ఆగ్రహం...టీఆర్‌ఎస్‌ నాయకుల్ని నిలదీసిన గ్రామస్తులు..!
x
Highlights

బొమ్మలరామారంలో గందరగోళం చోటు చేసుకుంది. హాజీపూర్‌ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలంటూ బాధిత చిన్నారుల కుటుంబాలు ఆమరణ దీక్షకు దిగాయి....

బొమ్మలరామారంలో గందరగోళం చోటు చేసుకుంది. హాజీపూర్‌ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలంటూ బాధిత చిన్నారుల కుటుంబాలు ఆమరణ దీక్షకు దిగాయి. వారిని పరామర్శించేందుకు టీఆర్ఎస్‌ నాయకులు రావడంతో వారిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకుండా కార్యకర్తలను పంపించడంపై మండిపడ్డారు. ప్రభుత్వంతో వెంటనే ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు.

హాజీపూర్‌ ఆవేశంతో రగిలిపోతోంది. తమ బిడ్డల ప్రాణాలు తీసిన నరరూప రాక్షసుడు శ్రీనివాస్‌ రెడ్డిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తోంది. హత్యలు జరిగిన నెలలు గడుస్తున్నా ఆ మృగాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊరు ఊరంతా కదిలింది. ఆ రాక్షసుడి ఆకృత్యాలకు బలైన ముగ్గురు చిన్నారులు కల్పన, శ్రావణి, మనీషా తల్లిదండ్రులు, వారి బంధువులతో పాటు గ్రామస్తులంతా దీక్షకు దిగారు. బొమ్మలరామారంలో ఆమరణ దీక్షకు దిగారు.

చనిపోయిన తమ బిడ్డలను తలుచుకుంటూ కన్నీళ్లు కారుస్తూ న్యాయం కోసం దీక్షకు కూర్చున్నారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన తమ బిడ్డల ఫోటోలను చూపిస్తూ ఆవేదనతో గుండెలు బాదుకున్నారు. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. హత్యలు జరిగి ఇన్నాళ్లైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని కనీసం బాధితుల తరపున ఏ ఒక్క హామీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్‌రెడ్డిని ఎప్పుడు శిక్షిస్తారని ప్రశ్నిస్తున్నారు. బాధితులు. తమ పిల్లలను ఎలా చంపారో శ్రీనివాస్‌రెడ్డిని, అతడి కుటుంబ సభ్యులను అలాగే శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిందితుడికి, అతడి కుటుంబానికి ఊళ్లో ఉండే అర్హత లేదని వదిలిస్తే ఊళ్లో మరొకడు తయారవుతాడని అన్నారు. వెంటనే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి శ్రీనివాస్‌రెడ్డి ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రీనివాస్‌రెడ్డి సైకో కాదని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవేళ సైకో అయితే కేవలం ఆడపిల్లలపైనే ఎందుకు పైశాచిక దాడి చేశారని ప్రశ్నిస్తున్నారు. అతడు కావాలనే ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. లేకపోతే శ్రీనివాస్‌ రెడ్డిని తమకు అప్పగించాలని తామే అతడి అంతు చూస్తామని ఆవేశంతో తమ గుండెల్లో బాధను తెలిపారు. తమ ఆందోళనలను ఎట్టి పరిస్థితుల్లో విమరించేది లేదని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం జరగాలని శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ దీక్షను కొనసాగించారు.





Show Full Article
Print Article
Next Story
More Stories