నేడు, రేపు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అలజడి

నేడు, రేపు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అలజడి
x
Highlights

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. సముద్రమట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతం అయింది. మూన్ సూన్ చురుకుగా ఉండడంతో...

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. సముద్రమట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతం అయింది. మూన్ సూన్ చురుకుగా ఉండడంతో కోస్తా తీరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర అలజడిగా వుండడంతో భారీ గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతీ రుతుపవనాల కారణంగా ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు 4 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే సూచనలున్నాయని, గంటకు 45-55 కిలో మీటర్ల వేగంతో వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు, ప్రజలెవ్వరూ తీర ప్రాంతానికి వెళ్లొద్దని సూచించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories