పాక్ అవమానంపై కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్..

పాక్ అవమానంపై కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్..
x
Highlights

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ ప్రవర్తించిన తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు....

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ ప్రవర్తించిన తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజ్యసభలో సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తూ పాక్ అవమానంపై కంటతడి పెట్టారు. భద్రత పేరుతో కుల్‌భూషణ్ తల్లి, భార్య ధరించిన దుస్తులను బలవంతంగా మార్పించడం, మంగళసూత్రాలు తీయించడం హేయమైన చర్య అని చెప్పారు. వితంతువులుగా వారిని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. షూలో కెమెరా లేదా రికార్డింగ్ పరికరం ఉందని పాక్ వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించిదని తెలిపారు. కుల్‌భూషణ్ తల్లి, భార్య రెండు విమానాల్లో ప్రయాణించి భర్త వద్దకు చేరుకుందన్న విషయాన్ని పాక్ విస్మరించిందని చెప్పారు. కుల్‌భూషణ్‌ను విడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories