రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో హీరోకు గాయాలు.. మహిళ మృతి
x
Highlights

టాలీవుడ్ యువ కథానాయకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రంతో పరిచయమైన సుధాకర్ కోమకుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి...

టాలీవుడ్ యువ కథానాయకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రంతో పరిచయమైన సుధాకర్ కోమకుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళగిరి (మం) చినకాకాని జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, సుధాకర్‌ గాయపడ్డాడు. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను సుధాకర్‌ కారు అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కేడే మృతి చెందింది. సుధాకర్‌ తాజాగా నువ్వు తోపురా చిత్రంలో నటించారు. మే 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories