జర్నలిజం అంతే మ‌రి..తన పెళ్లినే రిపోర్ట్‌ చేసి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కిన జ‌ర్న‌లిస్ట్

Submitted by arun on Mon, 02/05/2018 - 17:44
pak journalistWeddinglive telecast

చేస్తోన్న ఉద్యోగం పట్ల నిబద్ధత, అంకిత భావం అంటే ఇదేనేమో.. ఓ జర్నలిస్ట్ తన పెళ్లి రోజున కూడా సెలవు పెట్టలేదు.. మరికొన్ని నిమిషాల్లో ఒకరికి భర్తను కాబోతున్న సమయంలోనూ బ్రేకింగ్ న్యూస్ అంటూ రిపోర్టర్‌గా పనిచేశాడు. అది కూడ తన పెళ్లి పందిరి నుంచే.. అవును, పెళ్లి పందిరి నుంచే పెళ్లికూతురు, తన అత్తయ్యల ఇంటర్వ్యూ తీసుకుంటూ లైవ్ ప్రసారం చేశాడు. సిటీ 41 చానెల్‌లో పనిచేసే హనాన్‌ బుకారీ తన పెళ్లినే రిపోర్ట్‌ చేసి ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. 

ఏకంగా తనకు కాబోయే భార్యను, వారి తల్లి తండ్రులు, అత్త, మామలను ఇంటర్వ్యూ చేశాడు. తన తల్లినే ఇంటర్వ్యూ చేస్తూ మీ అబ్బాయి పెళ్లి అవుతోంది.. మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. తన ది ప్రేమ పెళ్లని కూడా తెలియజేశాడు. ఈ జర్నలిస్టు మాట్లాడిని మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఇంటర్వ్యూపై ట్వీటర్‌ వేదికగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పెళ్లి రోజు సైతం విధులు నిర్వర్తించడాన్ని కొందరు సమర్ధిస్తే మరి కొందరు ఇది విలువలు కలిగిన జర్నలిజమా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే దేవుడా.. జర్నలిజం ఎటుపోతుంది.. రిపోర్టర్‌లు కుటంబ విషయాలను సైతం కవర్‌ చేయాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

English Title
pak journalist covers his own wedding

MORE FROM AUTHOR

RELATED ARTICLES