logo

పద్మాదేవేందర్ రెడ్డిని అడ్డుకున్న ప్రజలు

గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసన సెగలు ఆగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. పాపన్న పేటలో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న, మొన్న మెదక్, గణపూర్, రామాయంపేట మండలాల్లో పద్మకు నిరసన ఎదురైనా ప్రచారం కొనసాగించారు. అబ్లాపూర్ గ్రామంలో హామీలేవి అమలు చేయలేదని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపేసి వెను దిరిగారు.

లైవ్ టీవి

Share it
Top