నెరవేరనున్నకృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ కల

నెరవేరనున్నకృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ కల
x
Highlights

నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌. కృష్ణ‌ప‌ట్నం ఓబుల‌వారి ప‌ల్లె రైల్వే లైన్ మొత్తం పనులు పూర్తి కానున్నాయి. త్వరలో ప్యాసింజర్ రైలు అందుబాటులోకి...

నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌. కృష్ణ‌ప‌ట్నం ఓబుల‌వారి ప‌ల్లె రైల్వే లైన్ మొత్తం పనులు పూర్తి కానున్నాయి. త్వరలో ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు మార్గంలో రైల్వే లైన్ డీజిల్ ట్రాక్ష‌న్ విజ‌య‌వంత‌మైంది. ఈ నెల 20న కృష్ణపట్నం- ఓబుళాపురం ఎల‌క్ట్రిక్ ట్రాక్ష‌న్ నిర్వ‌హించ‌నున్ననేపథ్యంలో స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ గురించి 2002లో అప్పటి ప్రధాని వాజ్ పేయి వద్ద కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపాదించడంతో ఆమోదం లభించింది. 1950 కోట్ల రూపాయ‌ల‌తో వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు 2004 లో ప్రారంభమయ్యాయి.

కోస్తా, రాయ‌ల‌సీమ మ‌ధ్య ముడి స‌రుకులు, ప్యాసింజర్ ర‌వాణాలో ప్ర‌ముఖ భూమిక పోషించే కృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ విష‌యంలో ఏన్డీఏ తర్వాత అధికారంలోకి వ‌చ్చిన యూపిఏ ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కించింది. అంతేకాక ఈ ప్రాజెక్టుపై ఆర్.వి.ఎన్.ఎల్, రైల్వేబోర్డు, అధికారుల మధ్య తలెత్తిన నిధుల వివాదంతో పనులు మందగించాయి. 2014లో ఏన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. నాడు కేంద్ర మంత్రినున్న వెంకయ్యనాయుడు కృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ గురించి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ల‌డంతో మ‌ళ్లీ ప‌నులు వేగం పుంజుకున్నాయి. ఈ రైల్వే లైన్ ను గత ఫిబ్రవరి 21న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు ప్రారంభించారు.

ఈ ప్రాజెక్ట్ ట‌న్నెల్ విష‌యంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఉండ‌టంతో ప్యాసింజర్ రైలు ప‌ట్టాలెక్క‌లేదు. ఇటీవల ఆర్వీఎన్ఎల్ అధికారులు నిర్వహించిన డీజిల్ ట్రాక్ష‌న్‌ సక్సెస్ కావడంతో ఈ నెల 20 నుంచి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ నిర్వహించనున్నారు. ఈ విషయం గురించి అధికారులు తెలుపడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ప్యాసింజర్ రైలు సౌకర్యం గురించి ఎంక్వయిరీ చేసిన ఆయన త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. కృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. కోస్తా, రాయ‌ల‌సీమ అనేక ప్రాంతాల మధ్య రైల్వే సౌక‌ర్యం అందుబాటులోకి వ‌స్తుంది. ఇదేమార్గంలో ప్యాస్సెంజర్ రైళ్ల ను నడపితే నెల్లూరు- కడప జిల్లాపై రోడ్డు రవాణాపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం నెల్లూరు నుంచి కడప వెళ్లాలంటే కనీసం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. ఈ కొత్త రైలుమార్గంలో ప్యాసెంజర్ రైల్లో కేవలం రెండుగంటల్లోనే నెల్లూరు నుంచి కడపకు చేరుకోవచ్చు. ద‌శాబ్ద‌న్న‌రం నాటి కృష్ణ‌ప‌ట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ కల త్వరలో సాకారం కానుండడంతో నెల్లూరు జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories